Gongura : రక్తాన్ని పెంచటంతోపాటు… రక్తపోటును తగ్గించే గోంగూర

క్యాన్సర్, గుండె, కిడ్నీ వ్యాధులను నివారించటంలో గోంగూర సహాయపడుతుంది. గోంగూరలో ఉండే ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి.

Gongura : రక్తాన్ని పెంచటంతోపాటు… రక్తపోటును తగ్గించే గోంగూర

Gongura2

Gongura : అందరికి అందుబాటులో ఉండే ఆకు కూర గోంగూర.. గోంగూరను ఆహారంగా తీసుకోవటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నయం చేయగలదిగా గోంగూరను చెప్పవచ్చు. గోంగూరలో విటమిన్ సి, ఎ, బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, పుష్కలంగా లభిస్తాయి.

రోగనిరోధక శక్తి పెంచటంలో గోంగూరను మించింది లేదు. జీర్ణశక్తిని పెంచటంతోపాటు జీర్ణక్రియలు సాఫీగా సాగటంలో దోహదపడుతుంది. ఇందులో పీచు పదార్ధం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియలు వేగం అయ్యేందుకు తోడ్పడతాయి. ఎముకుల ఆరోగ్యంగా ఉండటానికి గోంగూర లో ఉండే కాల్షియం, ఇనుము ఉపకరిస్తాయి. రక్తప్రసరణ మెరగయ్యేలా చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్ధాయిలను పెంచి షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుతుంది.

క్యాన్సర్, గుండె, కిడ్నీ వ్యాధులను నివారించటంలో గోంగూర సహాయపడుతుంది. గోంగూరలో ఉండే ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. చిన్నారుల్లో వచ్చే కంటి సమస్యలు పోవాలంటే గోంగూరను ఆహారంగా అందించటం ఉత్తమం. ఎందుకంటే ఇందులో ఉండే ఎ విటమిన్ వల్ల కంటి సంబంధిత సమస్యలను నివారించవచ్చు. శరీరంలో అలసట తగ్గించి ఊపిరితిత్తులతోపాటు ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫారా చేయటంలో గోంగూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

తిన్న ఆహారం విచ్ఛిన్నం చేసే సమయంలో పొగాకు, రేడియేషన్ వంటి హానికరమైన సమస్యలు వచ్చినప్పుడు ప్రీరాడికల్స్ఉత్పత్తి అవుతాయి. వీటిని సమర్ధవంతంగా ఎదుర్కోవటంలో గోంగూర బాగా ఉపకరిస్తుంది. గోంగూరు లో ఉండే పలు రసాయనాలు ప్రీరాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. రక్తపోటును తగ్గించటానికి దోహదం చేస్తుంది. గోంగూరలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి ఎముకలను, దంతాలను ఆరోగ్యవంతంగా ఉంచటంతోపాటు, బలో పేతం చేస్తుంది.