Beetroot Juice : బరువు తగ్గటంతోపాటు, లివర్ ఆరోగ్యానికి బీట్ రూట్ జ్యూస్!

బీట్ రూట్ రసం, నైట్రేట్లలో పుష్కలంగా ఉంటుంది. వృద్ధులలో మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి. రక్తపోటు తగ్గుతుంది. ప్రతిరోజూ బీట్‌రూట్ రసం తాగడం వల్ల పొటాషియం స్థాయిలు స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది.

Beetroot Juice : బరువు తగ్గటంతోపాటు, లివర్ ఆరోగ్యానికి బీట్ రూట్ జ్యూస్!

Beetroot Juice

Beetroot Juice : శరీరంలో రక్తాన్ని వృద్ధి చేయటంతోపాటు అనేక అనారోగ్యసమస్యలకు బీట్ రూట్ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. బీట్ రూట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A,విటమిన్ B6,ఐరన్ వంటివాటితోపాటు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటివి ఉన్నాయి.. రక్తహీనత సమస్య నుంచి త్వరిత కాలంలోనే బయట పడేందుకు బీట్ రూట్ జ్యూస్ బాగా ఉపకరిస్తుంది. శరీరంలో విష వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి.

బీట్‌రూట్ జ్యూస్ లో తక్కువ కేలరీలు మరియు తక్కువ కొవ్వు ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజు వారిగా దీనిని తీసుకోవచ్చు. బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్ బీటైన్ కాలేయంలోని కొవ్వు నిల్వలను నిరోధించడానికి లేదా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది కాలేయాన్ని టాక్సిన్స్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో ఉండే ఫైటోన్యూట్రియెంట్‌లు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. మద్యం తాగడం వల్ల పాడైపోయే లివర్‌ను కాపాడేందుకు బీట్ రూట్ జ్యూస్ చక్కగా ఉపయోగపడుతుంది. లివర్ చక్కగా పనిచెయ్యాలన్నా, లివర్ కు శక్తిని ఇవ్వాలన్నా బీట్ రూట్ జ్యూస్ తాగటం మంచిది.

బీట్ రూట్ రసం, నైట్రేట్లలో పుష్కలంగా ఉంటుంది. వృద్ధులలో మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి. రక్తపోటు తగ్గుతుంది. ప్రతిరోజూ బీట్‌రూట్ రసం తాగడం వల్ల పొటాషియం స్థాయిలు స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. తీవ్రమైన ఎండ, ఇతరత్ర కాలుష్యాల నుంచీ చర్మాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. బీట్ రూట్ జ్యూస్ లోపలి నుంచీ చర్మాన్ని కాపాడుతుంది. ఈ జ్యూస్‌లో ఉండే లైకోపీన్ సూర్యుడి తీవ్రమైన ఎండల నుంచీ మన చర్మాన్ని కాపాడుతుంది. ఆరోగ్యకరమైన సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.