Marriage : పెళ్ళైన కొత్తల్లో భార్య భర్తల బంధం బలపడాలంటే..

మనస్సులో భావాలను పంచుకోవటమేకాదు. ఒకరినొకరు వాటిని గౌరవించుకునే విధంగా నడుచుకోవాలి. ప్రతి విషయంలోనూ తనదే పైచేయిగా ఉండాలన్న మన్సతత్వం వల్ల ఇద్దరి నడుమ పొరపొచ్చాలు వచ్చే అవకాశం

Marriage : పెళ్ళైన కొత్తల్లో భార్య భర్తల బంధం బలపడాలంటే..

Wife,husbend (2)

Marriage : అన్ని బంధాల్లోకి పెళ్ళి బంధం చాలా పవిత్రమైనదిగా హిందూ సాంప్రదాయంలో బావిస్తుంటారు. విభిన్న ఆలోచనలు, మన్సతత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులను పెళ్ళిబంధం ఏకం చేస్తుంది. పెళ్ళి తంతు పూర్తయ్యాక వారి జీవితం కలకాలం సాఫీగా సాగిపోవాలని ప్రతి జంట కోరుకుంటుంది. తమలోని భయాన్ని పక్కనపెట్టి, మనస్సును ఇచ్చి పుచ్చుకుంటూ కలివిడిగా ఉండటం అనేది కొత్త జంట ముందుగా చేయాలి.

భార్యభర్తల మధ్య మాటలు ఒకరినొకరు అర్ధం చేసుకునేందుకు దోహదపడతాయి. రోజు వారి విషయాలను పాత ముచ్చట్లను భాగస్వామితో పంచుకోవటం వల్ల నమ్మకంతోపాటు, అభిమానము పెంచేందుకు దోహదపడుతుంది. ఏవైనా బాధ ఉన్న కడుపులో దాచుకోకుండా భాగస్వామితో షేర్ చేసుకుంటే కొన్ని సందర్భాల్లో వారు సూచించే సలహాలు బాధను పొగొట్టేందు దోహదపడే అవకాశాలు ఉంటాయి.

కొత్త జంట మధ్య ఉండే శారీరక, మానసిక అనుబంధాలు వారి ఆన్యోన్యతను మరింత పెంపొందించేలా దోహదం చేస్తాయి. లైంగిక అనుబంధంతోపాటు శారీరక, మానసిక విషయాలను ఎలాంటి దాపరికం లేకుండా ఒకరికొకరు పంచుకోవాలి. జీవితభాగస్వామి వద్ద దాపరికం వల్ల భవిష్యత్తులో అపోహలకు అది దారితీసే అవకాశాలు ఉండవచ్చు.

మనస్సులో భావాలను పంచుకోవటమేకాదు. ఒకరినొకరు వాటిని గౌరవించుకునే విధంగా నడుచుకోవాలి. ప్రతి విషయంలోనూ తనదే పైచేయిగా ఉండాలన్న మన్సతత్వం వల్ల ఇద్దరి నడుమ పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ అభిప్రాయాలను పరస్పరం షేర్ చేసుకోవాలి.

చాలా మందిలో భయం , బెరుకుతనం అనేది పెళ్ళి తరువాత సహజమే. అయితే వారికున్న ఇష్టాలను ఒకరితో ఒకరు పంచుకుంటే తదనుగుణంగా భవిష్యత్తు జీవితం సాఫీగా సాగేలా బంధం బలంగా తయారయ్యేందుకు మార్గం ఏర్పడుతుంది. కొంత మంది తమ మనస్సులోది బయటకు చెప్పాలని ఉన్నా వ్యక్తం చేస్తే ఏమౌతుందోనన్న భయంతో తమలో తామే దానిని దాచే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల వైవాహిక బంధంలో ఏదో వెలితికనిపిస్తున్నట్లు అనిపిస్తుంది.