Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!

ప్రతి ఇంటికి వెంటిలేషన్ తప్పనిసరి. వర్షాకాలంలో ఇంటి లోపల గాలి తేమగా ఉంటుంది. ఎండ ఉన్నప్పుడు కిటికీలన్నీ తెరచి, గదుల్లో గాలి, వెలుతురు ప్రసరించేలా చేయాలి. క్రాస్-వెంటిలేషన్ ఇంటి లోపల తేమ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!

Rainy Season

Rainy Season : వర్షాకాలంలో ఇంటిలో తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. ఇది కీటకాలు ఇతర ఇబ్బందికరమైన జీవులకు అనువైనదిగా మారుతుంది. కీటకాలు ఇంట్లో, ఇంటి పరిసరాల్లో తిష్టవేసుకుని ఉంటాయి. వీటిలో చాలా వరకు హానిచేయనివిగా ఉంటే ,కొన్ని కీటకాలు ఫర్నిచర్, గోడలు, వ్యాప్తి చెంది వ్యాధులకు కారణమౌతుంటాయి. చినుకులు పడుతున్నవేళ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా, ఫంగస్‌ చేరి అనారోగ్యాలను కలిగిస్తాయి. వర్షాకాలం దోమల ఉత్పత్తికి కేంద్రంగా ఉంటుంది. వర్షాకాలంలో నీటి నిల్వలు వీటికి ఆవసంగా మారతాయి. బాత్‌రూమ్‌లలో, వాటర్ కూలర్‌లలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఇంట్లోకి దోమలు రాకుండా వెంటిలేషన్ ఉండేలా అన్ని కిటికీలకు దోమతెరలను అమర్చుకోవాలి.

వర్షాకాలంలో పడకగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దుప్పట్లు తేమగా మారతాయి. ఎండ వచ్చినప్పుడు వీటిని వారానికొకసారి ఎండలో వేయాలి. దీని వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. తలగడ కవర్లు కనీసం వారానికి ఒకసారి మార్చి, ఉతకంటం చేయాలి. లేకపోతే శరీరానికి ఉండే మృతకణాలు వాటికి అంటుకొని ఉండి మనం పీల్చే శ్వాసద్వారా ఊపరితిత్తుల్లోకి చేరి సమస్యలు కలిగిస్తాయి. వాడిన తువ్వాళ్లను ఇంట్లో కాకుండా, ఎండతగిలే ప్రదేశంలో ఆరనివ్వాలి. చెక్క వంటి వాటికి తేమకారణంగా చెదలు పడుతుంటాయి. చెదలు రాకుండా యాంటీ టెర్మైట్ ద్రావణాలను ఉపయోగించాలి.

ప్రతి ఇంటికి వెంటిలేషన్ తప్పనిసరి. వర్షాకాలంలో ఇంటి లోపల గాలి తేమగా ఉంటుంది. ఎండ ఉన్నప్పుడు కిటికీలన్నీ తెరచి, గదుల్లో గాలి, వెలుతురు ప్రసరించేలా చేయాలి. క్రాస్-వెంటిలేషన్ ఇంటి లోపల తేమ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దుర్వాసనను తొలగిస్తుంది. అంతేకాకుండా, బాగా వెంటిలేషన్ ఉన్న ఇళ్ల గోడలు దెబ్బతినే అవకాశాలు తక్కువ. అస్తవ్యస్తమైన ఎలక్ట్రికల్‌ వైరింగ్ లు షార్ట్ సర్క్యూట్‌లకు కారణమౌతాయి. వంటింటిని శుభ్రంగా ఉంచుకోవాలి. కడిగిన గిన్నెలను బాగా ఆరిన తర్వాతే అలమరలో ఉంచాలి. డస్ట్‌బిన్‌ను వంటింటి బయట ఉంచాలి. ఇలా చేయటం వల్ల వ్యర్థాలపై దోమలు, ఈగలు వాలకుండా చూసుకోవచ్చు.