Increase Protein : ఆరోగ్యం కోసం.. మీ డైట్‌లో రోజూ ప్రోటీన్ చేర్చుకోండిలా..!

అసలే కరోనా కాలం.. అందులోనూ ఉరుకుల పరుగుల జీవనశైలి.. గంటలకొద్ది సమావేశాలు.. తీరికలేని పనివేళలతో ఆరోగ్యంపై దృష్టిపెట్టలేని పరిస్థితి. ఫలితంగా పోషకాహారం లోపంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

Increase Protein : ఆరోగ్యం కోసం.. మీ డైట్‌లో రోజూ ప్రోటీన్ చేర్చుకోండిలా..!

Increase Protein Intake To Stay Healthy

Increase protein intake to stay healthy : అసలే కరోనా మహమ్మారి కాలం.. అందులోనూ ఉరుకుల పరుగుల జీవనశైలి.. గంటలకొద్ది సమావేశాలు.. సరైన వ్యాయామం లేకపోవడం, తీరికలేని పనివేళలతో ఆరోగ్యంపై దృష్టిపెట్టలేని పరిస్థితి. ఫలితంగా పోషకాహారం లోపం ఏర్పడి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి అనేక వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో ప్రోటీన్ లోపం, ప్రోటీన్ గురించి అవగాహనను కల్పించేందుకు ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో (IMRB) సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 73 శాతం నగరవాసుల్లో ప్రోటీన్ లోపం ఉన్నట్లు తేలింది. వారిలో 93 శాతం మందికి రోజువారీ ప్రోటీన్ అవసరాలపై అవగాహన లేదని తేలింది. వాస్తవానికి, జంతు ప్రోటీన్ మూలంగా పౌల్ట్రీ ఉత్పత్తులను పట్టణ ప్రజలు తింటున్నారు. డైట్‌లో ప్రోటీన్‌ను చేర్చాల్సిన అవసరం ఉందని ప్రముఖ పోషకాహార నిపుణులు రితికా సమద్దార్ (Ritika Samaddar) సూచించారు.

ఆహారంలో ప్రోటీన్ అవసరంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది జూలై 24నుంచి 30 వరకు ప్రోటీన్ వీక్ జరుపుకుంటారు.  శరీరంలోని ప్రతి కణంలో ప్రోటీన్ ఉంటుంది. పెరుగుదల అభివృద్ధికి వ్యాధులపై పోరాడటానికి ప్రోటీన్ చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సగటు భారతీయుడికి ప్రోటీన్ కిలో శరీర బరువుకు 0.8 నుంచి 1.0గ్రా అవసరం ఉంటుంది. ఆరోగ్యకరమైన వయోజన జనాభాకు రోజుకు 50 నుంచి 60గ్రా ప్రోటీన్ అవసరం పడుతుంది. ప్రోటీన్ జీర్ణించుకోవడం కష్టం.. క్రమంగా అది బరువు పెరగడానికి దారితీస్తుంది. సాధారణంగా ప్రోటీన్ బాడీ బిల్డర్లకు మాత్రమేననే అభిప్రాయం ఉంది. మన ఆరోగ్యంపై ప్రోటీన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రితికా పేర్కొన్నారు.

ప్రోటీన్‌లో రెండు రకాలు.. :
మన ఆహారంలో తగినంత ప్రోటీన్లు లభిస్తాయని ఎలా నిర్ధారించుకోవాలి? ప్రోటీన్ రెండు రకాలు.. అందులో ఒకటి  పూర్తి, రెండోది అసంపూర్ణమైనది. అమైనో ఆమ్లాల (amino acids)తో నిండి ఉంటుంది. పౌల్ట్రీ, గుడ్డు, పాలు, చేప మొదలైన వాటిలో పూర్తి ప్రోటీన్లు ఉంటాయి. చికెన్, టర్కీ, బాతు గుడ్డు వంటి పూర్తి ప్రోటీన్ వనరులు పరిమాణం నాణ్యతపై అధికంగా ఉంటాయి. 100 శాతం జీర్ణమవుతాయి.

గుడ్లు, పౌల్ట్రీ, ప్రోటీన్, విటమిన్ A, విటమిన్ B12, జింక్, ఐరన్, సెలీనియం వంటి సూక్ష్మపోషకాలతో కలిసి ఉంటాయి. ఒక గుడ్డు సుమారు 7 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది. అదే 100 గ్రాముల చికెన్, టర్కీలో 20గ్రాముల నుంచి 21 గ్రాములు వరకు ఉంటుంది. అందుకే ప్రోటీన్ తీసుకునే నాణ్యతపై ఉండాలి. గుడ్డులో అధిక నాణ్యతలో ప్రోటీన్ ఉంటుంది. శక్తి స్థాయిలను అధికంగా ఉంచుతుంది. ప్రోటీన్ తగినంతగా తీసుకోకపోవడం వల్ల బలహీనత, అలసటకు దారితీస్తుంది. ఏదైనా గాయమైతే త్వరగా మానదు. పోషకాహార లోపంతో మధుమేహం వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని పోషక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆహారంలో తగినంత ప్రోటీన్ (daily protein requirements) ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి భోజనంలో ప్రోటీన్ చేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన అల్పాహారంతో ప్రతిరోజునూ ప్రారంభించాలంటున్నారు. ప్రతిరోజూ గుడ్డు లేదా పాలను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. గింజలు, మొలకలు లేదా గుడ్లు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను అల్పాహారంగా తీసుకోవచ్చు. ప్రోటీన్ రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. వ్యాధితో పోరాడటానికి చాలా అవసరం కూడా. ఏదైనా వ్యాధి నుంచి కోలుకున్న వారిలో కండరాల్లో శక్తిని కోల్పోతారు.. రోగనిరోధక శక్తి స్థాయిలను పెంచుకోవాలంటే ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యమని పోషక నిపుణులు సూచిస్తున్నారు.