Indians Online Usage: వారానికి పది గంటలు ఆన్‌లైన్‌లోనే..

ఇదేమంత ఆశ్చర్యమనిపించుకోదు. యాన్యువల్ కన్జూమర్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఇండియన్లు స్మార్ట్ ఫోన్లు ఎలా వాడుతున్నారని సర్వే చేసింది. 15ఏళ్ల నుంచి 69ఏళ్ల మధ్య ఉన్న స్మార్ట్ ఫోన్ యూజర్లు ఇంటర్నెట్ ను ఎలా వినియోగిస్తున్నారని తెలుసుకున్నారు.

Indians Online Usage: వారానికి పది గంటలు ఆన్‌లైన్‌లోనే..

Indians Online Usage (1)

Indians Online Usage: ఇదేమంత ఆశ్చర్యమనిపించుకోదు. యాన్యువల్ కన్జూమర్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఇండియన్లు స్మార్ట్ ఫోన్లు ఎలా వాడుతున్నారని సర్వే చేసింది. 15ఏళ్ల నుంచి 69ఏళ్ల మధ్య ఉన్న స్మార్ట్ ఫోన్ యూజర్లు ఇంటర్నెట్ ను ఎలా వినియోగిస్తున్నారని తెలుసుకున్నారు. చాలా మంది తాము 5G కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్నారట.

స్మార్ట్ ఫోన్ వాడే ఇండియన్లు, ఇంటర్నెట్ యూజర్లు 36శాతం మందిపై సర్వే నిర్వహించారు. క్రైమ్ లాంటి వాటి నుంచి సేఫ్ గా ఉండటం కోసం ఇలా చేస్తున్నామని చెబుతున్నారట.

ఎరిక్సన్ కన్జ్యూమర్ ల్యాబ్ రిపోర్టు బట్టి రోజుకు 3.4గంటల పాటు ఆన్ లైన్ లో ఉంటున్నారు. స్టూడెంట్లు, వర్క్ ప్లేసుల్లో ఉండేవారు, ఆన్ లైన్ క్లాసులు, వర్క్ చేసుకునే వారు ఇందులోకి వస్తారు. ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లు 5గంటల 24నిమిషాలు కచ్చితంగా ఆన్‌లైన్ లోనే గడిపేస్తున్నారు.

46శాతం మంది మాత్రం ఈ లెర్నింగ్ ప్లాట్ ఫాంలపై కోర్సులు నేర్చుకుంటున్నారు. అది కాకుండా జనరల్ వెబ్ బ్రౌజింగ్ లో 89నిమిషాల పాటు గడుపుతున్నారట. షార్ట్ లేదా లాంగ్ వీడియోలు చూస్తూ.. రోజుకు 92నిమిషాలు గడుపుతుండగా.. వాయీస్ కాల్స్ మాట్లాడటానికి అందులో 10శాతం సమయం మాత్రమే వినియోగిస్తున్నారు.

ఆన్ లైన్ టైంలో వారానికి దాదాపు 10గంటల సమయం ఇలా గడుపుతున్నారు. వారి సంతృప్తి పడకుండా ముగిస్తేనే ఇలా అవుతుందని.. ఇంకా 2.5శాతం ఇంటర్నెట్ వినియోగానికి వెచ్చించాలని ఉన్నా కాంప్రమైజ్ అవుతున్నారని డేటా చెప్తుంది.

ఈ ఇంటర్నెట్ వినియోగంపై ఆధారపడే వాళ్లు 2025నాటికి 64శాతం మంది ఉండొచ్చని ల్యాబ్ రిపోర్ట్ చెబుతుంది.