India Covid-19 second wave : కరోనావైరస్ ఫస్ట్ కంటే.. సెకండ్ వేవ్ ఎందుకు డేంజరంటే?

భారతదేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఒక్క శుక్రవారమే 62వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

India Covid-19 second wave : కరోనావైరస్ ఫస్ట్ కంటే.. సెకండ్ వేవ్ ఎందుకు డేంజరంటే?

Second Covid 19 Wave Could Be Much Worse Than The First

India Covid-19 second wave : భారతదేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఒక్క శుక్రవారమే 62వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పది రోజుల క్రితం దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 30వేల కంటే తక్కువగా ఉండేది. గత ఏడాది భారతదేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 30వేల నుంచి 60వేలకు పెరగడానికి 23 రోజుల వ్యవధి పట్టింది. అది కూడా జూలై, ఆగస్టు నెలలోనే ఈ సంఖ్యకు చేరింది. దేశ జనాభాలో కరోనా వ్యాప్తి ఒక కీలక దశకు చేరుకున్నాక వైరస్ కేసుల సంఖ్య క్షీణించడం మొదలవుతుంది. అది 50 శాతం కానక్కర్లేదు.

ఎందుకంటే జనాభాలో వైరస్ వ్యాప్తి 30శాతం లేదా 40శాతం జనాభాకు చేరిన తర్వాత కూడా క్షీణించవచ్చు. అంటువ్యాధుల బారిన పడే వ్యక్తుల సంఖ్య తగ్గడమే దీనికి కారణమని అంటోంది కొత్త అధ్యయనం. గత సెప్టెంబర్ లో తీవ్రంగా ఉన్న కరోనా కేసుల సంఖ్య గత ఐదు నెలలుగా తగ్గుతూ వచ్చింది. కమ్యూనిటీలో కూడా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అయినప్పటికీ కొత్త కేసులు తగ్గడం లేదు. ఇప్పటివరకూ ఒక మహారాష్ట్రలో మాత్రమే కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ఒక శుక్రవారం గుజరాత్, పంజాబ్ లో కూడా సింగిల్ డేలో అత్యధిక స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ రెండింటిలో మహారాష్ట్రలో పదిలో ఒక వంతు మాత్రమే గతంలో కేసులు నమోదయ్యాయి.

కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఇప్పడిప్పుడే కేసుల తీవ్రత పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళ మాత్రమే కాకుండా కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లో రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో రోజుకు 7వేల కేసులు నమోదు కాగా.. తమిళనాడు, కర్నాటకలో రోజుకు 2వేల కేసులు నమోదువుతున్నాయి. ఫిబ్రవరిలో రోజువారీ కేసులు 500 కంటే తక్కువగా కనిపించాయి. ఫిబ్రవరి మొదటివారంలో రెండు అంకెల కేసులు కాస్తా పడిపోయాయి. ఆంధ్రా వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్ర మాదిరిగా కరోనా కేసులు నమోదైతే.. కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

దేశంలో అత్యధిక జనాభా గల టాప్ ఐదు రాష్ట్రాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇంకా సెకండ్ వేవ్ ప్రారంభం కాలేదు. అక్కడ వారిలో మహమ్మారిని ఎదుర్కొనేంత ఇమ్యూనిటీ ఉందని కూడా చెప్పలేం. గతంలో బీహార్, పశ్చిమ బెంగాల్ 4వేలు దాటింది. సెప్టెంబర్ లో రోజులో 7వేల కేసులు నమోదయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ కేసులున్న కొన్ని రాష్ట్రాల్లో ఒక మహారాష్ట్ర మాత్రమే 60వేల కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 60 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో 2.83లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుత కొత్త కరోనా కేసుల సంఖ్య శనివారానికి మూడు లక్షలకు పెరిగే అవకాశం ఉంది.