Instagramలో కొత్త రూల్ : మీ పుట్టిన తేదీ చెప్పాల్సిందే

  • Published By: sreehari ,Published On : December 5, 2019 / 01:05 PM IST
Instagramలో కొత్త రూల్ : మీ పుట్టిన తేదీ చెప్పాల్సిందే

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ సొంత యాప్ ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్. ఇక నుంచి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు వాడాలంటే మీ పుట్టిన తేదీ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఈ కొత్త రూల్ బుధవారం ( డిసెంబర్ 4 )నుంచే అందుబాటులోకి వచ్చేసినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇన్ స్టాగ్రామ్ కొత్త యూజర్లంతా తమ డేటా ఆఫ్ బర్త్ అప్ డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇప్పటి వరకూ ఇన్ స్టాగ్రామ్ కొత్త యూజర్లలో కనీసం 13 ఏళ్ల ఉంటేనే చెక్ చేస్తూ వస్తోంది. తమ ప్లాట్ ఫాంపై యువ యూజర్ల ప్రైవసీ (సేఫ్టీ) కోసం ఈ కొత్త మార్పులను ఇన్ స్టాగ్రామ్ తీసుకోస్తోంది. యూజర్ల పుట్టిన తేదీలను వివిధ ప్రైవసీ సెట్టింగ్స్, ఫీచర్ల కోసం సిఫార్సు చేసేందుకు వినియోగించనుంది.

ఆల్కాహాల్, పొగాకు Ads కోసం :
యూజర్ల పుట్టిన తేదీలు మాత్రం పబ్లిక్‌గా కనిపించవు. అసలు ఎందుకు ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల పుట్టినతేదీలను తప్పనిసరి చేస్తుందంటే.. యంగ్ యూజర్ల సేఫ్టీతో పాటు టార్గెటెడ్ యాడ్స్ కోసం వినియోగించనుందని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆల్కాహాల్, పొగాకు ఆధారిత యాడ్స్ కోసం ఆడియెన్స్ విస్తరించడంతో పాటు ఇతర వయస్సు ఆంక్షల ప్రొడక్టులను కూడా ఆఫర్ చేయనుంది.

యంగ్ యూజర్ల కోసం సురక్షిత ప్రమాణాలను తీసుకొస్తోంది. ఇలా చేయడం ద్వారా యూజర్ల వయస్సును బట్టి టార్గెటెడ్ ఆడియెన్స్ కు ఆల్కహాల్, పొగాకు యాడ్స్ చేరేలా మార్పులు చేస్తోంది. తద్వారా దేశంలోని వయస్సు పరిమితి లోబడి ఉన్న యంగ్ యూజర్లకు ఇలాంటి యాడ్స్ కనిపించవు. అంతేకాదు.. తమకు ఎవరు డైరెక్ట్ మెసేజ్ లు పంపాలో రిస్ట్రిక్ట్ చేసేలా యూజర్లకు మరింత పవర్స్ త్వరలో ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది.

Age వెరిఫై ఎక్కడ.. యూజర్ల విమర్శలు :
ఇన్ స్టాగ్రామ్ నిర్ణయంపై యూజర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. చాలామంది యూజర్లు తమ పుట్టినతేదీలను ఇన్ స్టాగ్రామ్ Verify చేయడం లేదని అంటున్నారు. దీని కారణంగా పిల్లలు కూడా తమ వయస్సు తప్పుగా చెప్పి అకౌంట్ యాక్సస్ అనుమతి ఇచ్చేలా ఉందని చెబుతున్నారు.

యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని మరింత యాక్సస్ చేసుకుంటోందని ఇతర యూజర్లు విమర్శిస్తున్నారు. 13ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లల పర్సనల్ డేటాను ఆన్ లైన్ సర్వీసుల నుంచి సేకరించడాన్ని చైల్డ్ ఆన్ లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ రూల్ ద్వారా బ్యాన్ చేసిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ ఈ మార్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలోనే యూట్యూబ్ భారీ మొత్తంలో పెనాల్టీ చెల్లించాల్సి వచ్చింది.

పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా కంపెనీ సేకరించిందనే ఆరోపణలతో ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు యూట్యూబ్ 170 మిలియన్ల డాలర్లు వరకు చెల్లించింది. ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ కూడా యూజర్ ఎక్స్ పీరియన్స్ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇన్ స్టాగ్రామ్ లో యూజర్ల Likes బటన్ హైడ్ చేయడంపై టెస్టింగ్ చేస్తున్నట్టు తెలిపింది.