Health : రోజంతా చురుకుగా ఉండాలంటే ఉదయం టీ, కాఫీలకు బదులుగా?

అల్పాహారం ఉదయం సమయంలో బద్ధకాన్ని దూరంగా ఉంచుతుంది. రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించేందుకు అవసరమైన పాజిటివిటీని అందిస్తుంది.. బరువు తగ్గడం, మలబద్ధకం, ఉబ్బరం, ఆమ్లత్వం మరియు మరెన్నో నివారించడం కోసం ఇది చాలా అవసరం.

Health : రోజంతా చురుకుగా ఉండాలంటే ఉదయం టీ, కాఫీలకు బదులుగా?

Stay All Day

Health : రోజంతా శక్తివంతంగా ఉండటానికి సరైన ఉదయం దినచర్య అవసరం. రోజంగా చాలా హుషారుగా ప‌నిచేయాలంటే ప‌రగ‌డుపున తినే ఆహారం విషయంలో శ్రద్ధవహించాలి. అయితే కొన్ని రకాల ఆహార ప‌దార్థాలు తీసుకుంటే చాలా ఉప‌యోగాలు ఉన్నాయి. వీటి వల్ల రోజు మొత్తం చురుకుగా ఉండేందుకు తోడ్పడతాయి. నిద్రలేచిన తరువాత 20 నిమిషాలలోపు ఒక గ్లాసు సాధారణ నీటిని తాగటంతో దినచర్యను ప్రారంభించాలి. ముఖ్యంగా ఉదయం పూట మొదటగా టీ లేదా కాఫీ తాగడం మానేసి ఒక అరటిపండు లేదా తాజా పండ్లను తినటం అలవాటుగా మార్చుకోవాలి. అరటిపండు తినడం జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి సహాయపడుతుంది

రాత్రిపూట నానబెట్టిన ఎండుద్రాక్షలను తీసుకోవటం మంచిది. ఉదయం పూట నానబెట్టిన, ఒలిచిన బాదంపప్పులను 4 నుండి 6 వరకు తినాలి. మధుమేహం, ఉన్నవారు ఇలా చేయటం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఎందుకంటే వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఉదయం 15 లేదా 20 నిమిషాల పాటు వ్యాయామం, యోగా కోసం ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాయామాలు పూర్తి చేసిన గంటలోపు అల్పాహారం తీసుకోవచ్చు. రాత్రి స‌మ‌యంలో జీల‌క‌ర్రను నీటిలో వేసి నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఆ నీటిని తాగాలి. దాంతో అది క‌డుపును మొత్తం ఖాళీ చేస్తుంది. క‌డుపులోని చెడు ప‌దార్థాల‌ను బ‌ట‌య‌కు పంపేస్తుంది.

అల్పాహారం ఉదయం సమయంలో బద్ధకాన్ని దూరంగా ఉంచుతుంది. రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించేందుకు అవసరమైన పాజిటివిటీని అందిస్తుంది.. బరువు తగ్గడం, మలబద్ధకం, ఉబ్బరం, ఆమ్లత్వం మరియు మరెన్నో నివారించడం కోసం ఇది చాలా అవసరం. ఇక అన్నింటికంటే గొప్ప పండు బొప్పాయి. ప్ర‌తి ఒక్క‌రు ఉద‌యాన్నే దీన్ని తినాలంటూ చెబుతున్నారు. దాని వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని చెడు కొవ్వును ఈజీగా క‌రిగిస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన అన్ని పోష‌కాలు అందుతాయి.