ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా వైట్ బ్రడ్ కు బదులుగా?
బ్రేక్‌ఫాస్ట్‌లో తృణధాన్యాలతో చేసిన బ్రెడ్స్ ఉదయం పూట తీసుకోవడం వల్ల శరీరంలో ఫైబర్ పరిమాణం పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శరీరంలో పోషకాహార లోపం తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బరువు సులభంగా నియంత్రించుకోవచ్చు.

ఇటీవలి కాలంలో అధిక బరువు పెద్ద సమస్యగా మారింది. బరువును నియంత్రించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు నియంత్రించుకోవడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయి. ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఉదయం పూట టిఫిన్‌లో అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు.
ముఖ్యంగా బ్రెడ్ లాంటి ఐటమ్స్‌ను అధిక పరిమాణంలో తీసుకోవటాన్ని అలవాటుగా మార్చుకున్నారు. అయితే వీటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం అల్పాహారంగా వైట్ బ్రడ్ కు బదులుగా తృణధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్ తీసుకోవటం మంచిదని, మంచి పోషకాలున్న ఈ బ్రెడ్లు తీసుకోవడం వల్ల కూడా బరువు నియంత్రించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే మూలకాలు శరీరాన్ని దృఢంగా చేయడమే కాకుండా శరీరారికి మంచి పోషకాలు అందిస్తాయి.
బ్రేక్‌ఫాస్ట్‌లో తృణధాన్యాలతో చేసిన బ్రెడ్స్ ఉదయం పూట తీసుకోవడం వల్ల శరీరంలో ఫైబర్ పరిమాణం పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శరీరంలో పోషకాహార లోపం తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బరువు సులభంగా నియంత్రించుకోవచ్చు. అలాగే ఓట్స్ బ్రెడ్ బరువును నియంత్రించేందుకు తోడ్పడుతుంది. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ బి1, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పీచు పదార్థం బ్లడ్‌లోని షుగర్ లెవల్స్‌ను నియంత్రించి. అధిక రక్తపోటును నివారిస్తుంది. ఇదే క్రమంలో బరువు కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తీసుకోదలచిన వారు తప్పని సరిగా గుర్తుంచు కోవాల్సిన విషయం ఏటంటే వైట్ బ్రెడ్ శరీరానికి హానికలిగిస్తుంది. దీనికి బదులుగా మల్టీ గ్రెయిన్ తో తయారై బ్రెడ్ తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
గమనిక; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ రకాల సమస్యలున్నవారు వైద్యుల సలహాలు, సూచనలు పాటించటం మంచిది.