International Coffee Day 2020 : అత్యంత ఖరీదైన కాఫీలు..ధరలు

  • Published By: madhu ,Published On : October 1, 2020 / 01:10 PM IST
International Coffee Day 2020 : అత్యంత ఖరీదైన కాఫీలు..ధరలు

International Coffee Day 2020 : గరం గరం Cofee తాగాలని చాలా మంది ఇష్టపడుతుంటారు. రోజులో ఒక్కసారైనా కాఫీ తాగేవారుంటారు. వివిధ పద్దతుల ద్వారా కాఫీ గింజలను తయారు చేస్తుంటారు. అత్యంత క్లాస్టీ కాఫీలు కూడా లభ్యమవుతుంటాయి. రుచి, సువాసనతో ప్రత్యేక కాఫీలుగా పేరొందాయి.


కాఫీ తయారీలో ఉపయోగించే కాఫీ బీన్స్ ను ప్రత్యేకమైన ప్రాంతాల్లో పెంచుతుంటారు. మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటాయి. మరి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీల ధరలు చూస్తే షాక్ తినాల్సిందే.


కోపి లువాక్ (Kopi Luwak) : ప్రపంచ అత్యంత ఖరీదైన కాఫీల్లో ఒకటి. సివెట్ పిల్లుల పేడ నుంచి సేకరిస్తారు. కాఫీ బీన్స్ మేతగా వేయడం వల్ల జీర్ణ వ్యవస్థలో బీన్స్ యొక్క చేదు గుణం తొలగిపోతుందంటారు. ఇండోనేషియ ద్వీపాలైన జావా, బాలి, సులవేసిలలో ఉత్పత్తి అవుతుంది. దీని ధర ఒక పౌండ్ (453 గ్రాములు) $100 డాలర్ల నుంచి $600 డాలర్లు (భారతదేశ కరెన్సీ లో రూ.7 వేల నుంచి రూ.50 వేలు) వరకూ ఉంటుంది.


Black Ivory Coffee : ఉత్తర థాయిలాండ్ లోని అరబికా కాఫీ గింజలను ఏనుగులకు తినిపిస్తారు. తర్వాత వాటి పేడ నుంచి వీటిని సేకరిస్తారు. ఈ బ్రాండ్ ఉత్తర థాయ్ ల్యాండ్ లో మాత్రమే తయారు చేయబడుతుంది. కప్పు $ 50 డాలర్లు (ఇండియా కరెన్సీలో రూ.3560) లభిస్తుంది. పౌండ్ ధర $ 500 డాలర్లు ( ఇండియా కరెన్సీలో రూ.35,605లు) ఉంటుంది.
ఎల్ ఇంజెర్టో (El Injerto) : గ్వాటెమాలలోని హ్యూహ్యూటెనాంగో ప్రాంతంలో గల కొండ ప్రాంతంలో దీనిని పండిస్తారు. పశ్చిమ పనామాలో గల బారు పర్వతంలోని హసిండా లా ఎస్మెరాల్డా పొలాల్లో పండిస్తుంటారు. $ 50 డాలర్లు.



Esmeralda Special : పశ్చిమ పనామాలోని Mount Baru, Hacienda La Esmeralda పొలంలో దీనిని పండిస్తుంటారు. పూలు, పండ్లు, తీపి వాసనకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కాఫీ గుర్తింపు పొందింది. కాఫీ గింజలను ఎన్నుకుని వేర్వేరు పద్ధతుల ద్వారా జాగ్రత్తగా processed చేస్తారు. పౌండ్ కు 350 డాలర్లు చొప్పున అమ్ముతుంటారు.


St. Helena Coffee : దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని మారుమూల అగ్ని పర్వత ద్వీపమైన సెయింట్ హెలెనాలో పండిస్తుంటారు. ఈ కాఫీ సెయింట్ హెలెనాలోని ప్రత్యేకమైన ఆకుపచ్చ అరబికా బీన్ నుండి తయారు చేయబడుతుంది. దీని పౌండ్ ధర $75 డాలర్లు (రూ.5350లు) వరకూ ఉంటుంది.