Boost Hemoglobin : హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడే ఐరన్ రిచ్ డ్రింక్స్!

హిమోగ్లోబిన్ పెంచటంలో బీట్ రూట్ బాగా ఉపకరిస్తుంది. ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, బీటైన్ మరియు విటమిన్ సితో సహా అనేక పోషకాలతో నిండి ఉంది. బీట్‌రూట్ రసం కాలేయం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది

Boost Hemoglobin : హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడే ఐరన్ రిచ్ డ్రింక్స్!

Boost Hemoglobin

Boost Hemoglobin : రక్తంలో ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి అవసరమైన హిమోగ్లోబిన్ ప్రోటీన్ సరైన పనితీరుకు ఇనుము ముఖ్యమైన ఖనిజం. శరీరంలోని అనేక ఇతర ముఖ్యమైన ప్రక్రియలలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధారణ శక్తి,దృష్టి, జీర్ణశయాంతర ప్రక్రియలు, రోగనిరోధక వ్యవస్థ, శరీర ఉష్ణోగ్రత నియంత్రణతో సహా శరీరంలోని అనేక విధులను సంరక్షించడానికి సహాయపడుతుంది. పెద్దలకు కనీస రోజువారీ 1.8 mg.ఇనుము అవసరం. తప్పనిసరిగా ఆహారం లేదా కొన్నిసార్లు-సప్లిమెంట్ల ద్వారా ఈలోటును భర్తీ చేసుకోవాలి. ఒకరికి చాలా తక్కువ ఇనుము ఉంటే, వారు రక్తహీనత పరిస్ధితి ఎదుర్కోవాల్సి వస్తుంది. తక్కువ ఐరన్ స్థాయిలకు కారణాలు రక్తం కోల్పోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, తినే ఆహారం నుండి తగినంత ఇనుమును గ్రహించలేకపోవడం ముఖ్యకారణాలు. మాంసం, చేపలు, టోఫు, బఠానీలు, బచ్చలికూర, బీట్‌రూట్ మొదలైన ఆహారాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ వస్తువులతో అనేక వంటకాలు తయారు చేయవచ్చు. ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన కొన్ని ఐరన్-రిచ్ డ్రింక్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

8 ఎండు ఖర్జూరాలను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన ఎండు ఖర్జూరాలలో గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి పేస్ట్ గా చేయాలి. ఆ తర్వాత 8 బాదం పప్పులను,8 జీడిపప్పులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి అరలీటర్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక పావు స్పూన్ పసుపు,ఖర్జూరం పేస్ట్, ముక్కలుగా కట్ చేసిన బాదం,జీడిపప్పులను వేయాలి. ఆ తర్వాత అంగుళం దాల్చినచెక్క ముక్కను వేయాలి. 5నిమిషాలు కాగించిన తరువాత బెల్లం కలిపి వాటిని చల్లారిన తరువాత సేవించాలి. ఇలా పదిరోజుల పాటు చేస్తే రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుకోవచ్చు.

హిమోగ్లోబిన్ పెంచటంలో బీట్ రూట్ బాగా ఉపకరిస్తుంది. ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, బీటైన్ మరియు విటమిన్ సితో సహా అనేక పోషకాలతో నిండి ఉంది. బీట్‌రూట్ రసం కాలేయం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. అలాగే ఆక్సిజన్‌ను మన ఎర్ర కణాల వినియోగించుకునేలా చేస్తుంది. 2 మీడియం బీట్‌రూట్‌లు, 1 దోసకాయ మరియు 1-అంగుళాల అల్లం సన్నని ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. అందులో కొంచెం నిమ్మరసం కలుపుకుని సేవించాలి. ఇలా చేస్తే రక్తహీనత నుండి బయటపడవచ్చు.

బచ్చలి ఆకుతో తయారు చేసిన జ్యూస్ సైతం హిమోగ్లోబిన్ పెంచటంలో సహాయపడుతుంది. ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు పానీయం సాధారణంగా ఉదయాన్నే తీసుకోవచ్చు. ఆకుకూరలు ఐరన్, విటమిన్ ఎ మరియు సి వంటి అనేక ఇతర పోషకాలకు మంచి మూలంగా చెప్పవచ్చు.అంతేకాకుండా, ఈ పానీయం బరువు తగ్గడానికి కూడా మంచిది. 4 కప్పుల తరిగిన బచ్చలికూర, 1 కప్పు సన్నగా తరిగిన పుదీనా, 1/2 కప్పు నీరు కలిపి జ్యూస్ గా తయారు చేసుకోవాలి. అనంతరం దానిని వడకట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ జీలకర్ర పొడి, వేసి బాగా కలపాలి. చల్లదనం కోసం ఐస్ క్యూబ్స్ వేసుకుని అనంతరం సేవించాలి. ఇలా పదిరోజుల పాటు చేస్తే శరీరంలో రక్తం స్ధాయిలు బాగా పెరుగుతాయి.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించటమైనది. ఇది కేవలం అవగాహన కలిగించటం కోసం మాత్రమే. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారు వైద్యుని సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.