Cold Bath : శీతాకాలంలో చన్నీటి స్నానం ఆరోగ్యానికి మంచిదా?..

చలిగా ఉన్న సమయంలో సముద్రంలో కానీ, నదిలో గాని, స్విమ్మింగ్ పూల్, స్నానం చేసే షవర్ కింద నిలబడి తడిచినప్పుడు మన శరీరంలో ఉన్న మానసిక ఒత్తిడి ఇట్టే దూరం అవుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తెలిసింది.

Cold Bath : శీతాకాలంలో చన్నీటి స్నానం ఆరోగ్యానికి మంచిదా?..

Cold Bath

Cold Bath : చన్నీటితో స్నానం చెయ్యాలంటే ఒళ్ళు జివ్వుమంటుంది. అందులోను చలికాలంలో చన్నీటి స్నానం అంటే అస్సలు ఒప్పుకోరు. వేడినీళ్ల స్నానాన్నే ఎక్కువమంది ఇష్టపడతారు. అయితే చన్నీళ్లతో స్నానం చేస్తే కూడా మన శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయని పలు పరిశోధనల్లో తేలింది. అనేక రకాల అనారోగ్యాల నుంచి చన్నీళ్ల స్నానంతో ఉపశమనం కూడా లభిస్తుంది. చల్లని నీరు రక్తప్రసరణ అధికం చేసి రోగ నిరోధకత పెంచుతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం వేడెక్కుతుంది. దీంతో శరీరంలోని కొవ్వు కరుగుతుంది. రోజూ చన్నీళ్ల స్నానం చేస్తే ఏడాదికి నాలుగు కిలోల వరకు బరువు తగ్గుతారు.

బాగా పనిచేసి అలసిపోయిన వారు వేడి నీళ్లు పెట్టుకుని స్నానం చేస్తే హాయిగా ఉంటుందని అనుకుంటారు. ఎక్కువ మంది వేడి నీటి స్నానానికే ఇష్టపడతారు. చల్లని నీటితో స్నానం చేయడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చేసిన కొన్ని రకాల ప్రయోగాల ద్వారా తెలుస్తోంది. చన్నీటితో స్నానం చేయడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత వస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది. అలాగే గుండెలోని రక్తనాళాల వద్ద అధికంగా పెరిగిపోయిన కొవ్వు పేరుకుపోకుండా చన్నీటి స్నానం ఉపసమానం కలిగిస్తుంది.

చలిగా ఉన్న సమయంలో సముద్రంలో కానీ, నదిలో గాని, స్విమ్మింగ్ పూల్, స్నానం చేసే షవర్ కింద నిలబడి తడిచినప్పుడు మన శరీరంలో ఉన్న మానసిక ఒత్తిడి ఇట్టే దూరం అవుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తెలిసింది. ప్రతిరోజు చన్నీటి స్నానం చేయడం, స్విమ్మింగ్ చేయడం వంటివి చేసే వారిలో శ్వాసకోస వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గుండె సంబంధ సమస్యలు తొలగిపోతాయి. చర్మం కాంతి పెరుగుతుంది. అదే విధంగా చన్నీటితో స్నానం చేస్తే వెంట్రుకలు నల్లగా అవుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. జుట్టు కూడా రాలకుండా దృఢంగా పెరుగుతుంది.

రెగ్యులర్ గా చల్లని నీటి స్నానం చేస్తే మన శరీరంలో రోగాలతో పోరాడే తెల్ల రక్త కణాలు సంఖ్య పెరుగుతుందని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రీసెర్చి చెపుతోంది. కొన్నిపరిశోధనల ప్రకారం ఉదయం చేసే చన్నీటి స్నానం వల్ల సహజంగా వచ్చే జలుబును నివారించవచ్చు. కారణం ఏంటంటే శరీరం లోపల నుండి హాట్ రేడియేషన్ ప్రారంభమవుతుంది. దీని వల్ల మూసుకుపోయిన ముక్కురంద్రాలు తెరుచుకొనేలా చేస్తుంది. క్రమం తప్పకుండా రోజూ చల్లని నీటితో స్నానం చేస్తే, చాలా వ్యాధులు నివారించవచ్చు.