Milk : పచ్చిపాలు తాగటం ఆరోగ్యానికి హానికరమా?..

పశువుల యజమానులు పాలు పితికే సమయంలో నీళ్లు, ఇతర పదార్థాలను కలుపుతారు. పశువుల పొదుగు సరిగా కడగని సందర్భంలోను అనేక మలినాలు పాలలోకి వచ్చి చేరుతాయి. అలాంటి పాలను నేరుగా తాగితే ఉదర సంబంధ

Milk : పచ్చిపాలు తాగటం ఆరోగ్యానికి హానికరమా?..

Milk

Milk : పచ్చిపాలు తాగ‌డం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఇటీవల ప్రచారం ప్రారంభమైంది. అయితే వాస్తవానికి పచ్చిపాలు తాగటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. పచ్చిపాలకు.. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని స్ఫష్టం చేస్తున్నారు. పచ్చిపాలు తాగడం వల్ల ఆహారానికి సంబంధించిన విషతుల్యమైన బాక్టీరియా కడుపులోకి వెళ్లి తీవ్ర దుష్పరిణామాలు సంభవిస్తాయ‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది.

సూక్ష్మక్రిమిరహిత పాలు తాగడం వలన తలెత్తే ఆహార సంబంధమైన వ్యాధుల కన్నా పచ్చిపాలు తాగడం వలన వచ్చే కలుషిత ఆహార రోగాలు ఎక్కువ ప్రమాదకరమని పరిశోధనల్లో తేలింది. పట్టణాలు, నగరాల్లో ప్యాకెట్ పాలు లభిస్తాయి. అదే గ్రామాల్లో చాలా మంది గేదెలు, ఆవుల నుంచి పితికిన పాలను నేరుగా సేకరిస్తారు. వాటిని బాగా మరగబెట్టి చల్లారిన తర్వాత ఉపయోగిస్తారు. కానీ కొందరు మాత్రం అలాగే పచ్చి పాలను తాగుతారు. పచ్చి పాలలో పలు రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు ఉండే పాలను తాగితే కీళ్ల వాపు, డయేరియా, డీహైడ్రేషన్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

పశువుల యజమానులు పాలు పితికే సమయంలో నీళ్లు, ఇతర పదార్థాలను కలుపుతారు. పశువుల పొదుగు సరిగా కడగని సందర్భంలోను అనేక మలినాలు పాలలోకి వచ్చి చేరుతాయి. అలాంటి పాలను నేరుగా తాగితే ఉదర సంబంధ ఇబ్బందులు తప్పవు. వేడి చేయని అపరిశుభ్రమైన పాలు తాగితే ట్యుబర్కులోసిస్ అనే ప్రమాదకర జబ్బు వచ్చే అవకాశముంది. బ్యాక్టీరియా వల్ల ఊపరితితులపై ఈ వ్యాధి ప్రభావం చూపుతుంది.

పచ్చి పాలల్లోని ఇన్‌ఫెక్షన్‌ కారకాలైన బ్యాక్టీరియా ఆహార సంబంధ జబ్బులను ప్రధానంగా పిల్లల్లో, గర్భవతుల్లో, వయోవృద్ధుల్లో, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో రేకెత్తించే ప్రమాదం ఉంది. ఇందులో బ్యాక్టీరియా ఉండడం వల్ల పచ్చి పాలు త్వరగా పాడైపోతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు పచ్చి పాలను తీసుకోకుండా మరగించిన తరువాతనే తాగటం మంచిది. పచ్చి పాలు తాగడం వల్ల శరీరంలో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. శరీరంలో యాసిడ్ పెరిగతే ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు అందుకే పచ్చిపాలు తాగకపోవడమే శ్రేయస్కరం. పచ్చిపాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించకుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.