Milk : రోజు పాలు తాగితే గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువే?…

నిత్యం పాలు లేదా పాల సంబంధ ప‌దార్థాల‌ను క‌నీసం రెండు లేదా అంత‌క‌న్నా ఎక్కువ సార్లు తీసుకుంటే డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు 24 శాతం వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటాయ‌ని పరిశోధకులు తేల్చారు.

Milk : రోజు పాలు తాగితే గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువే?…

Milk

Milk : పాలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. అవి ఆరోగ్యాన్ని క‌లిగిస్తాయి. అవి నిజంగా చ‌క్క‌ని ఆహారం. పాల‌ను పోష‌కాల గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. పాల‌లో కాల్షియం అనే పోష‌క ప‌దార్థం స‌మృద్ధిగా ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. పాల‌లో ఉండే ప్రోటీన్ కండ‌రాల నిర్మాణానికి దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే వీటిలో ఉండే విట‌మిన్ ఎ, బి, డిలు కాల్షియం, ఇత‌ర పోష‌కాల‌ను శ‌రీరం శోషించుకునేలా చేస్తాయి. అయితే పాల‌ను నిత్యం తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లిగిన‌ప్ప‌టికీ కొంద‌రు మ‌న‌కు పాలు మంచివి కావ‌ని భావిస్తుంటారు. వాటిని తాగ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతామ‌ని, అవి త్వ‌ర‌గా జీర్ణం కావ‌ని, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని.. కొంద‌రు బావిస్తుంటారు.

అయితే ఒక గ్లాసు పాల‌లో 8 గ్రాముల ప్రోటీన్‌, 300 మిల్లీగ్రాముల కాల్షియం, పొటాషియం, విట‌మిన్ డి, ఇత‌ర పోష‌కాలు ఉంటాయి. వెన్న తీయ‌ని పాల‌లో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ఆ పాల‌ను తాగితే బ‌రువు పెరుగుతారు. అదే వెన్న తీసిన పాలు అయితే వాటిలో ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది బ‌రువు త‌గ్గుతారు.

పిల్ల‌లు, పెద్ద‌లు ఎవ‌రైనా స‌రే పాల‌ను నిత్యం అంద‌రూ తాగ‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే కీల‌క పోషకాల‌ను పాలు అందిస్తాయి. అయితే చిన్నారుల‌కు ఆవు పాలు తాగించాలి. యుక్త వ‌య‌స్సులో ఉండేవారు టోన్డ్ మిల్క్ తాగాలి. అదే పెద్ద‌లు అయితే స్కిమ్మ్‌డ్ మిల్క్ తాగాలి.

పాలు, పాల సంబంధ ప‌దార్థాల‌ను నిత్యం రెండు పూట‌లా తీసుకుంటే డ‌యాబెటిస్, హైబీపీ, గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. పాలు, పెరుగు, చీజ్ త‌దిత‌ర ప‌దార్థాలను నిత్యం రెండు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల ఆయా అనారోగ్యాల‌కు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు తేల్చారు. పాల‌లో ఉండే లాక్టోస్ అనే ప‌దార్థం వ‌ల్ల కొంద‌రికి పాలు జీర్ణం కావు. దీంతో గ్యాస్‌, అసిడిటీ వ‌స్తాయి. దీన్నే లాక్టోస్ ఇన్‌టోల‌రెంట్ అని పిలుస్తారు. ఈ స‌మ‌స్య కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే వ‌స్తుంది. పాలు జీర్ణం అయ్యే వారు వాటిని నిర్భ‌యంగా తాగ‌వ‌చ్చు.

నిత్యం పాలు లేదా పాల సంబంధ ప‌దార్థాల‌ను క‌నీసం రెండు లేదా అంత‌క‌న్నా ఎక్కువ సార్లు తీసుకుంటే డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు 24 శాతం వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటాయ‌ని పరిశోధకులు తేల్చారు. అలాగే గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ని తెలుసుకున్నారు. నిత్యం పాలు లేదా పాల సంబంధ ప‌దార్థాల‌ను తీసుకోని వారిలో డ‌యాబెటిస్‌, హైబీపీ వ‌చ్చిన‌ట్లు నిర్దారించారు. క‌నుక ఆయా ఆహార ప‌దార్థాల‌ను నిత్యం రెండు లేదా అంత‌క‌న్నా ఎక్కువ సార్లు తీసుకుంటే ఆయా అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

ఆయుర్వేద ప్ర‌కారం పాల‌ను రాత్రిపూట తాగితేనే ఎక్కువ ఫ‌లితాలు ఉంటాయి. రాత్రి పూట పాలలో తేనె, అశ్వ‌గంధ‌, త్రిఫ‌ల చూర్ణం వంటివి క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల నిద్ర లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. నిద్ర బాగా వ‌స్తుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. కంటి చూపు పెరుగుతుంది. కంటి స‌మ‌స్య‌లు పోతాయి. ఉద‌యం పూట మ‌న శ‌రీర మెట‌బాలిజం త‌క్కువ‌గా ఉంటుంది. అలాంట‌ప్పుడు పాల వంటి భార‌మైన ప‌దార్థాల‌ను తీసుకుంటే జీర్ణ‌వ్య‌వ‌స్థకు ఇబ్బందులు వ‌స్తాయి. త్వ‌ర‌గా జీర్ణం కావు. గ్యాస్‌, అసిడిటీ వంటివి వ‌స్తాయి.