Mutton : మటన్ తినటం ఆరోగ్యానికి మంచిదేనా?

మటన్‌లో కాల్షియం ఎక్కవగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. సొరియాసిస్‌, ఎగ్జిమా, వంటి చర్మ సమస్యలను తొలగిపోతాయి.

Mutton : మటన్ తినటం ఆరోగ్యానికి మంచిదేనా?

Mutton

Mutton : నాన్ వెజ్ లో పోషకాలు అధికంగా లభించేంది మటన్‌లోనే. చాలా మంది మటన్ అంటే ఎంతో ఇష్టపడతారు. మటన్ లో అధికంగా ప్రొటీన్లు ఉంటాయి. మేకపోతు, పొటేలు మాసాన్ని మటన్ గా పిలుస్తారు. శరీరానికి అవసరమైన పోషక విలువలు కలిగిన మంచి పౌష్టికాహారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలి. అధికమోతాదులో తీసుకోవటం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

మటన్ లో బి1, బి2, బి3, బి9, బి12 విటమిన్లు ఉంటాయి. విటమిన్‌ఇ, కె, సహజ ఫ్యాట్స్‌, కొలెస్ట్రాల్‌, అమినోయాసిడ్స్‌,మాంగనీసు, కాల్షియం, జింక్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, సెలేనియం ,పొటాషియం, సోడియం, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఒమేగా6 ఫ్యాటీయాసిడ్స్‌ ఉంటాయి. మటన్ లో ప్రొటీన్లు, న్యూట్రియంట్లు, బి12 బాగా ఉండడం వల్ల కొవ్వును కరిగించే సామర్థ్యం తోపాటు, ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి, దెబ్బతిన్న కణాలు సరికావటానికి దోహదపడుతుంది.

గర్భిణీలు తమ డైట్‌లో మటన్‌ని కూడా తింటే పుట్టే బిడ్డలకు న్యూరల్‌ ట్యూబ్‌ వంటి సమస్యలు రాకుండా చూడవచ్చు. బహిష్ఠ్ఠు సమయాల్లో తలెత్తే నొప్పి నుండి ఉపసమనం పొందవచ్చు. మటన్‌లో బీకాంప్లెక్స్‌, సెలినియం, కొలైన్‌ వంటివి క్యాన్సర్‌ బారిన పడకుండా దోహదపడతాయి. మటన్‌లో అధిక పొటాషియం, తక్కువ సోడియంలు ఉండడం వల్ల రక్తపోటు, స్ట్రోకు, మూత్రపిండాల సమస్యలు రాకుండా చూడవచ్చు.

మటన్‌లో కాల్షియం ఎక్కవగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. సొరియాసిస్‌, ఎగ్జిమా, వంటి చర్మ సమస్యలను తొలగిపోతాయి. చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. అదే క్రమంలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారు మటన్ తినటం అంత శ్రేయస్కరం కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ మరింత పెరగటంతోపాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

అంతే కాకుండా మటన్ లో అధికంగా ఉండే కొవ్వు పదార్ధాలు షుగర్ లెవల్స్ పెరగటానికి కారణమౌతాయని పరిశోధనల్లో తేలింది. ఒకవేళ మటన్ తినాలని పిస్తే కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి. 40 సంవత్సరాలు పై బడిన వారు మటన్ అడపతడపా తప్ప అదేపనిగా మటన్ ను ఆహారంలో భాగం చేసుకోవటం మంచిదికాదు.