Carrot Juice : క్యారెట్ తినటం కంటే జ్యూస్ చేసుకుని తాగటం మంచిదా?…

క్యారెట్‌ను రోజు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. క్యారెట్‌లో ఉండే ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది.

Carrot Juice : క్యారెట్ తినటం కంటే జ్యూస్ చేసుకుని తాగటం మంచిదా?…

Carrot Juice

Carrot Juice : క్యారెట్ తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. క్యారెట్ లో క్యారటీన్ అనే రసాయనం ఉంటుంది. క్యారెట్ ను ఆహారంగా తీసుకుంటే ఆ రసాయనం మన శరీరంలో విటమిన్ ఎగా మార్పు చెందుతుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచటంలో ఎంతో ఉపకరిస్తుంది. క్యారెట్ తినటం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. క్యారట్ లో విటమిన్ ఎ, బి, సి,డి, ఇ, జి, కె కాల్షియం, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఉంటాయి. క్యారెట్‌లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది.

క్యారెట్‌ను రోజు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. క్యారెట్‌లో ఉండే ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది. క్యారెట్‌లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌, పిరిడాక్సిన్‌, థయామిన్‌ వంటివి విటమిన్లు జీవక్రియను క్రమంగా ఉంచుతాయి. కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా క్యారెట్ ఉపయోగపడుతుంది. క్యారెట్ రోజు తింటే లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ముప్పు ఉండదు. క్యారెట్ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. విటమిన్-ఎ లోపం వల్ల చర్మం, జుట్టు పొడిబారుతాయి. రోజు క్యారెట్ తింటే ఆ సమస్యలు దరిచేరవు.

అయితే పచ్చి క్యారట్ తీసుకోవటం కంటే క్యారట్ ను జ్యూస్ గా చేసుకోని తాగటం వల్ల ఎక్కవ ప్రయోజనం కలుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి క్యారట్ తీసుకుంటే 1శాతం మాత్రమే బీటాకెరోటిన్ ను శరీరం గ్రహిస్తుంది. అదే క్యారట్ ను జ్యూస్ గా చేసుకుని తాగటం వల్ల అందు ఉండే జీర్ణం కాని పీచు పదార్ధం తొలగించబడుతుంది. శరీరం 100 శాతం బీటాకెరోటిన్ ను గ్రహిస్తుంది. దీని వల్ల రక్తపోటు తగ్గుతుంది. మూత్రపిండాలకు పైన ఉండే అడ్రనల్ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. బరువు పెరగటం వంటివి ఉండవు, మూత్రసమస్యలు తొలగి సుఖనిద్ర పడుతుంది.