Using Plastic Containers : ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేయడం ప్రమాదకరమా?

ఇంట్లో కూరగాయలు కోయడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ ఉపయోగిస్తుంటే , అలాంటి చర్యలను నిలిపివేయటం మంచిది. వాస్తవానికి, ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులో ఉండే హానికరమైన అంశాలు ఆహారంలో కలిసిపోతాయి. వాటిని ఆహారంగా తీసుకున్న వారిలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి.

Using Plastic Containers : ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేయడం ప్రమాదకరమా?

Using Plastic Containers

Using Plastic Containers : పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం కొత్త థీమ్‌తో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. ఈ ఏడాది ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు అనేదానిపై ప్రజల్లో అవగాహన పెంపొందించే ప్రయత్నాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం మనపరిసరాలే కాకుండా ప్రతి ఇంట్లోనూ ప్లాస్టిక్ రెక్కలు విప్పినట్లు కనిపిస్తుంది. నిత్యజీవితంలో ఈ ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం వల్ల తీవ్ర రోగాలు వ్యాపిస్తున్నాయి.

READ ALSO : Fatty Liver Problem : ఫ్యాటీ లివర్ సమస్య మానసిక ఆరోగ్యాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుందో తెలుసా ?

వేసవిలో శరీరం హైడ్రేట్ గా ఉండాలంటే నీరు అవసరం. అటువంటి పరిస్థితిలో, 100 మందిలో 80 మంది తమ ఇళ్లలో ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో బిస్ ఫినాల్ ఎ (బిపిఎ) అనే రసాయన సమ్మేళనం ఉపయోగించబడుతుంది. పాలికార్బోనేట్ ప్లాస్టిక్‌ను తయారు చేయడానికి BPA ఉపయోగించబడుతుంది. దీని వినియోగం క్యాన్సర్ ,హార్మోన్ల సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాట్టి ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం విషయంలో పునరాలోచించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Preventing Cancer : క్యాన్సర్ రాకుండా అడ్డుకోవటంలో ఈ ఆహారాలను మించినవి లేవంటున్న నిపుణులు !

ప్లాస్టిక్ కంటైనర్లు ;

ప్లాస్టిక్ సీసాల వలె, బిస్ ఫినాల్ A (BPA) కూడా ఇంట్లో సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్లలో ఉపయోగించబడుతుంది. అలాంటి వాటిలో ఉంచిన వస్తువులపై ఆ రసాయనాల ప్రభావం చూపుతాయి. మనం వీటిని ఉపయోగించినప్పుడు, అవి మన శరీరాన్ని లోపలి నుండి బోలుగా మార్చుతాయి. ఇంట్లో నుండే ప్లాస్టీక్ ప్రక్షాళన ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ కంటైనర్లను తొలగించి వాటిస్ధానంలో స్టీల్ లేదా గాజు పాత్రలను ఉపయోగించాలి.

READ ALSO : kidney Stones : కాఫీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా లేదా తగ్గుతుందా?

ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు ;

ఇంట్లో కూరగాయలు కోయడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ ఉపయోగిస్తుంటే , అలాంటి చర్యలను నిలిపివేయటం మంచిది. వాస్తవానికి, ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులో ఉండే హానికరమైన అంశాలు ఆహారంలో కలిసిపోతాయి. వాటిని ఆహారంగా తీసుకున్న వారిలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ఆహారంలో ఉండే బ్యాక్టీరియా కాలక్రమేణా పెరగడం ప్రారంభమవుతుంది. ఇది కడుపు సంబంధిత వ్యాధులను పెంచుతుంది. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ బదులుగా చెక్క లేదా రాతి పై కత్తిరించుకోవాలి.

READ ALSO : Digestive System : వేసవిలో జీర్ణప్రక్రియ సవ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలను తీసుకోవటం మంచిది !

ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు ;

ఇళ్లలో ప్లాస్టిక్ టిఫిన్ బాక్సుల వాడకం పెరిగింది. వాటి వాడకం వల్ల వ్యాధులు పెరగటానికి అవకాశం ఉంటుంది. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్‌లో ఉంచడం ద్వారా, హానికరమైన పదార్థాలు ఆహారంలో కరిగిపోయి కలిసిపోతాయి. వాటిని తింటే మూత్రపిండాలు, కాలేయానికి సంబంధించిన అనేక వ్యాధులు ఉత్పన్నం అవుతాయి. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేసి గాజు లేదా, స్టీల్ స్టోరేజ్ బాక్స్ లను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.