Custard Apple : శీతాకాలం సీజనల్ ఫ్రూట్ సీతఫలం తినటం మంచిదేనా?..

సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.

Custard Apple : శీతాకాలం సీజనల్ ఫ్రూట్ సీతఫలం తినటం మంచిదేనా?..

Custard Apple

Custard Apple : సీతాఫ‌లం. ఇందులో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో సీతాఫలాలు మార్కెట్లో కనిపిస్తాయి. చాలా మంది ఈ పండ్లను ఇష్టంగా తింటారు. ఈ పండును తినటం వల్ల శ‌రీరానికి చాలా పోష‌కాలు అందుతాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇందులో పొటాషియం , మెగ్నీషియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇవి గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. సీతాఫలంలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది మన చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. సీతాఫలం అల్సర్లను నయం చేయడంలో, అసిడిటీని నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.

ఈ పండు కళ్లకు కూడా మంచిదని భావిస్తారు. కంటి చూపును, జుట్టుని, మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. అందుకే ఈ పండును ఆహారంలో చేర్చడం చాలా ముఖ్యం. ఇందులో ఉండే రాగి మలబద్ధకాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది. విరేచనాల చికిత్సలో కూడా తోడ్ప‌డుతుంది. అలసిపోవడం, బలహీనంగా అనిపిస్తే ఈ పండును మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఇందులో ఉండే పొటాషియం కండరాల బలహీనతను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇది రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. సీతాఫలంలో సహజ చక్కెర ఉంటుంది.

సీతాఫలం జీర్ణవ్యవస్థను సరిచేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. విరేచనాల్ని తగ్గిస్తుంది. ఈ పండులో విటమిన్ బి 6 ఉంటుంది. డోపామైన్‌తో సహా న్యూరోట్రాన్స్‌మిటర్ల తయారీలో ఈ పోషకం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పోషకాన్ని తగినంత మొత్తంలో తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సీతాఫలంలో కాటెచిన్స్, ఎపికాటెచిన్స్ , ఎపిగాల్లోకాటెచిన్స్ వంటి పదార్థాలు ఉంటాయి. సీతాఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని డైట్. అయితే ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి సీతాఫలాలు తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడేమో కానీ మళ్లీ అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు.