Exercises : జిమ్ కు వెళ్లటం కష్టంగా ఉందా…సులభమైన వ్యాయామాలు

టెన్నిస్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్.. ఇలా ఏదో ఒక ఆటను మీ స్నేహితులతో కలిసి ఆడండి. ఆటలు ఆడడాన్ని మీ రొటీన్‌లో భాగం చేసుకుంటే క్యాలరీలు కరగటంతోపాటు , బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Exercises : జిమ్ కు వెళ్లటం కష్టంగా ఉందా…సులభమైన వ్యాయామాలు

Gym

Exercises : రోజురోజుకు పెరిగి పోతున్న శరీర బరువును తగ్గించుకోవాలని అంతా అనుకుంటారు. ఇందుకోసం జిమ్ కు వెళ్ళాలనుకుంటారు. కాని పనుల బిజీ కారణంగా జిమ్ కు వెళ్ళలేరు. దీంతో బరువు రోజురోజుకు పెరిగి పోతుంటారు. అలాంటి వారు జిమ్ కు వెళ్ళకుండానే చిన్నపాటి వ్యాయామాలు చేయటం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల డబ్బులు చెల్లించి మరీ జిమ్ లో చేరాల్సిన పని తప్పుతుంది.

బరువు తగ్గేందుకు రన్నింగ్ అనేది అత్యంత సులువైన మార్గం. మీరు ఎక్కడున్నా సరే.. ప్రతి రోజూ ఉదయం రన్నింగ్ చేయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. సరదాగా స్పోర్ట్ షూస్ ధరించి, మంచి మ్యూజిక్ వింటూ ఎవరైనా స్నేహితులుంటే వారితో కలసి అలా పరిగెడితే చాలు.. బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. రన్నింగ్ తోపాటు ప్రతిరోజు ఇరవై నిమిషాల పాటు నడిచేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మంచి ఫలితం ఉంటుంది. అరగంట పాటు వేగంగా నడవడం వల్ల.. మీరు బరువు తగ్గే వీలుంటుంది.

వ్యాయామం చేయడానికి చాలామందికి సమయం ఉండదు. ఇలాంటివారు కనీసం ఏడు నిమిషాల పాటు వర్కవుట్ చేయడం వల్ల కొవ్వు వేగంగా కరిగే వీలుంటుంది. ఇందులో భాగంగా తొలుత నిమిషం పాటు పుషప్స్.. ఆ తర్వాత మరో నిమిషం పాటు ప్లాంక్ ట్రై చేయాలి. ఆ తర్వాత ఒక నిమిషం పాటు జంపింగ్ జాక్స్ చేశాక.. మరో నిమిషం సిటప్స్, ఇంకో రెండు నిమిషాల పాటు లెగ్ రైజెస్ చేసి.. ఆ తర్వాత స్ట్రెచింగ్ వ్యాయామం చేయాలి.

ఎక్కడున్నా సులభంగా చేయటగలిగే వ్యాయామాలలో యోగా ఒకటి. ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే సులువుగా చేయవచ్చు. ఇది మీ కండరాలను స్ట్రెచ్ చేయడంతో పాటు.. మీ శరీరాన్ని టోన్ చేస్తుంది. ఇల్లు, ఆఫీసులో లిఫ్ట్ వినియోగం తగ్గించి మెట్లు ఎక్కి వెళ్ళటం అలవాటు చేసుకోండి ఇలా చేయటం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. చాలామంది చిన్నవయస్సులో సైకిల్ తొక్కడం అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక సైకిల్ తొక్కటమంటే చిన్నతనంగా భావిస్తారు. వాస్తవానికి సైకిల్ తొక్కటం వల్ల క్యాలరీలు కరగడంతో పాటు ఎంతో ఉత్సాహం, ఆనందం కూడా మీ సొంతం అవుతుంది.

టెన్నిస్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్.. ఇలా ఏదో ఒక ఆటను మీ స్నేహితులతో కలిసి ఆడండి. ఆటలు ఆడడాన్ని మీ రొటీన్‌లో భాగం చేసుకుంటే క్యాలరీలు కరగటంతోపాటు , బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎక్సర్సైజ్ డాక్టర్ సెడ్రిక్ బ్రయంట్ చెప్పినట్లు ఉదయం చేసే వ్యాయామాలు రోజంతా మంచి శక్తిని అందిస్తాయి. ఒత్తిడి, ఆందోళనలు, చిరాకును తొలగించటానికి ఉదయం పూట చేసే చిన్నపాటి వ్యాయామాల వల్ల ప్రయోజనం ఉంటుంది. కీళ్ళు, కండరాలు దృడంగా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.