Heart : వీటితో గుండెకు నష్టమే?

చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు, ఆహారంలో ఉప్పును ఎక్కువ మోతాదులో వేసుకోవటం ఏమాత్రం మంచిదికాదు. దీని వల్ల హైపర్‌ టెన్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అది క్రమేపి గుండె జబ్బులకు దారితీస్తుంది.

Heart : వీటితో గుండెకు నష్టమే?

Heart

Heart : మనిషి దేహంలో ముఖ్యమైన అవయవాల్లో గుండె ప్రధానమైనది. గుండె పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇటీవలి కాలంలో ఆహారపు అలవాట్ల లో అనేక మార్పులు కారణంగా చాలా మంది చిన్నవయస్సులోనే గుండెజబ్బుల బారిన పడుతున్నారు. న్యూట్రీషనల్ వ్యాల్యూస్ ఏమాత్రం ఉండని ఆహారాలు తీసుకోవటం, రోజువారిగా వ్యాయామాలు చేయకుండా ఒకేచోటకు పరిమితం కావటం వంటి వాటి వల్ల గుండె సంబంధిత సమస్యలు చుట్టుముడుతున్నాయి.

గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను మితంగా తీసుకోవటం, మరికొన్నింటిని అసలు తినకపోవటమే మంచిది. అలాంటి వాటిల్లో ఎక్కవ రోజులు నిల్వ ఉండే పచ్చళ్లు, ఇతర ప్రిజర్వేటివ్స్ ను తినకపోవటమే బెటర్. గుండె ఆరోగ్యానికి ఇవి ఏమాత్రం మంచివి కావు. అలాంటి ఆహారాలను తినటం వల్ల గుండె సమస్యలు వస్తాయి. గుండె బలంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. ఇంట్లో తయారు చేసే ఆహారపదార్ధాలను మాత్రమే తీసుకోవటం మంచిది.

చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు, ఆహారంలో ఉప్పును ఎక్కువ మోతాదులో వేసుకోవటం ఏమాత్రం మంచిదికాదు. దీని వల్ల హైపర్‌ టెన్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అది క్రమేపి గుండె జబ్బులకు దారితీస్తుంది. చక్కెర తీసుకోవటం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. హై శ్యాచురేటెడ్ ఫ్యాట్ వ‌ల్ల గుండె సంబంధిత వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతాయి. కేక్స్, బిస్కెట్స్, స్నాక్స్ లో ఎక్కువ‌గా రిఫైన్డ్ ఫ్లోర్ పదార్ధాలు తినకపోవటమే మేలు. గొడ్డుమాంసం, పందిమాంసం, పౌల్ట్రీ మాంసాలలో హానికలిగించే రసాయనాలు, పెస్టిసైడ్స్, యాంటీ-బయాటిక్స్, హార్మోన్స్ వంటివి గుండెపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారం విషయంలో పోషకాహార నిపుణులు, వైద్యుల సూచనలు , సలహాలు తీసుకోవటం మంచిది.