Beer : వేసవిలో చల్లదనం కోసం బీరు తాగటం మంచిదా?

చల్లని బీర్లు వేసవిలో చల్లదనాన్నిఇస్తున్నప్పటకీ బీర్‌లు ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తాయి. జీర్ణశయాంతర ప్రేగు యొక్క ఉష్ణోగ్రతను చాలా త్వరగా తగ్గించడం ద్వారా జీర్ణవ్యవస్థలో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి

Beer : వేసవిలో చల్లదనం కోసం బీరు తాగటం మంచిదా?

Beer

Beer : వేసవిలో వేడి నుంచి తప్పించుకోవడానికి వీలైనన్ని బీర్లు తాగేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వేసవి తాపానికి చల్లటి బీరే పరిష్కారమని చాలా మంది భావిస్తుంటారు. దీంతో వేసవి కాలంలో బీర్ల అమ్మకాలు అమాంతం పెరిగిపోతుంటాయి. మండే ఎండ నుంచి బయట పడాలంటే చల్లని బీరు గొంతుతడిపితే భగభగమండే భానుడు కూడా తమను ఏం చేయలేడని మందుబాబులు వాదిస్తుంటారు. బీరు తాగడం వల్ల ఏమీ శరీరానికి చల్లదనం కలగదని మరికొందరు వాదిస్తున్నారు.

బీరులో సాధారణంగా నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ శాతం పరిమితంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో బీరు తాగేవారు ఎక్కవగా ఉంటారు. కొంతమంది బీరు తాగటం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుందని భావిస్తుంటారు. వాస్తవానికి బాగా వ్యాయామం చేశాక బీరు తాగిన సందర్భాల్లో శరీరం ఎక్కువ నీటిని పొందటం కంటే మూత్రం ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతున్నట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఇలా జరగడం శరీరానికి మంచిది కాదు. అయితే, ఆల్కహాల్ లేని బీరు తాగినప్పుడు మాత్రం ఫలితాలు కొంత మెరుగ్గా ఉన్నాయి.

అమైనో ఆమ్లాలు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న బీర్లు మీ ఆకలిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇటీవలికాలంలో మందుబాబుల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని పలు ప్రత్యేకమైన బీర్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేకంగా తయారు చేసే వీట్ బీర్‌తో పాటు స్వీట్ మ్యాంగో ఫ్లేవర్డ్ బీర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. వేసవి వేడిని తొలగించడంలో ఇవి సహాయపడతాయి. అయితే, మీ శరీరానికి హాని కలిగించకుండా ఉండేందుకు వేసవిలో బీర్ తాగేటప్పుడు అనేక విషయాలపై శ్రద్ధ వహించాలి.

దాహం తీర్చుకోవటం కోసం బీరు తాగకండి. ఇలా బీరు సేవించటం వల్ల చెమట ఎక్కువగా పట్టేలా చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బీర్ తాగిన తర్వాత చల్లగా ఉండటం వాస్తవమే అయినప్పటికీ, ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, ఇది అడ్రినలిన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది, హృదయ స్పందనను వేగవంతం చేస్తుంది, రక్త నాళాలను విస్తరిస్తుంది. చమట రూపంలో శరీరం నుండి వేడిని పెంచుతుంది. దీనివల్ల దాహం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆల్కహాల్ మూత్రపిండాలను కూడా ప్రేరేపిస్తుంది. జీవక్రియ, మూత్రవిసర్జనను వేగవంతం చేస్తుంది. దీని వల్ల శరీరం మరింత నీటిని కోల్పోయేలా చేస్తుంది. బీర్లు తాగిన తర్వాత, హైడ్రేటెడ్‌గా ఉండటానికి వేడి నీరు లేదంటే టీని త్రాగాలి.

బార్బెక్యూ తినేటప్పుడు చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడతారు. ఈ రెండు కలిపి తీసుకోవటం వల్ల గౌట్ , క్యాన్సర్‌కు దారి తీస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాధారణంగా బార్బెక్యూడ్ ఫుడ్ అంటే సీఫుడ్, లివర్, మాంసం వంటివి. బీర్ తాగేటప్పుడు బార్బెక్యూ తినడం గౌట్ ప్రమాదాన్ని పెంచుతుంది. బార్బెక్యూయింగ్ బెంజోపైరిన్ వంటి క్యాన్సర్ కారకాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. చల్లని బీర్లు వేసవిలో చల్లదనాన్నిఇస్తున్నప్పటకీ బీర్‌లు ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తాయి. జీర్ణశయాంతర ప్రేగు యొక్క ఉష్ణోగ్రతను చాలా త్వరగా తగ్గించడం ద్వారా జీర్ణవ్యవస్థలో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. చల్లని బీర్ తాగడం వల్ల డయేరియా వంటి జీర్ణకోశ వ్యాధులు కూడా వస్తాయి. కొన్నిసార్లు, ఇది తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్‌కు కూడా కారణం కావచ్చు. వేసవిలో ఎక్కువ బీర్లు తాగడం వల్ల మీ కాలేయం, మూత్రపిండాలు మరియు గుండెపై భారం పెరుగుతుంది. ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటాయి.

బీర్లు తాగడం వల్ల కిడ్నీ, ప్యాంక్రియాస్,అపెండిక్స్‌లో ఖనిజ లవణాలు పేరుకుపోవడానికి, కొవ్వు పేరుకుపోవడానికి కూడా కారణమవుతుంది. నిపుణులు రోజుకు 1000ఎం.ఎల్ కంటే ఎక్కువ బీర్లు తాగకూడదని సూచిస్తున్నారు. శరీరానికి తగినంత నీటిని అందించడంలో బీరు కంటే కూడా సాధారణ నీళ్లు, స్పోర్ట్స్ డ్రింక్‌లు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని ఓ అధ్యయనంలో తేలింది.