Hair Loss : జుట్టు ఊడిపోవటానికి శరీరంలో పోషకాలు లోపమే కారణమా? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మేలంటే!

మ‌ద్య‌పానం, ధూమ‌పానానికి దూరంగా ఉండాలి. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు, పొల్యూష‌న్‌లో తిరిగిన‌ప్పుడు త‌ల‌ను స్కార్ఫ్ లేదా క్యాప్‌ సాయంతో క‌వ‌ర్ చేసుకోవాలి. త‌ల‌స్నానం చేసే ముందు రోజు జుట్టుకు నూనె పెట్టుకుని మ‌సాజ్ చేసుకుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Hair Loss : జుట్టు ఊడిపోవటానికి శరీరంలో పోషకాలు లోపమే కారణమా? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మేలంటే!

hair loss

Hair Loss : జుట్టు రాలడం ప్రస్తుత కాలంలో సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ఇరవై ఏళ్లకే జుట్టు రాలిపోయి బట్టతల రావడం, వెంట్రుకలు తెల్లబడటం ప్రస్తుతం చూస్తున్నాం. జుట్టు రాలడం ఆగిపోవాలని, నెలకో షాంపూను, నూనెను మార్చే వారు చాలా మందే ఉన్నారు. ఆహార పదార్థాలకు వాడే రసాయన మందుల ప్రభావంతోనే ఇలా జరుగుతుంది. షాంపూను, నూనెను మార్చినంత మాత్రాన జుట్టు రాలడం ఆగిపోదు. జుట్టుకు కావాల్సింది లోపలి నుంచి పోషణ. అప్పుడే మీ జుట్టు రాలడం ఆగుతుంది. మన శరీరంలో పోషకాల లోటు ఏర్పడితే జుట్టు రాలడం మొదలవుతుంది. విటమిన్లు, ప్రొటీన్లు ఉన్న ఆహారాలను తీసుకుంటే కచ్చితంగా ఫలితం ఉంటుంది.

ప్రోటీన్ ఆహారాలు ; బట్టతల రాకుండా ఉండాలంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. గుడ్లు, చేపలు, పప్పుధాన్యాలు, డ్రైఫ్రూట్స్, పాలు తదితర వాటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంతో అవి మన జుట్టు రాలడాన్ని అరికడతాయి. మళ్లీ కొత్త జుట్టు వచ్చేందుకు కూడా దోహదం చేస్తాయి. ప్రోటీన్ ఫుడ్ మన శరీరానికే కాదు జుట్టుకు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. ఎవరి శరీరంలో అయితే ప్రోటీన్ లోపిస్తుందో వారి జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. జట్టు ఊడిపోవడం ఆగిపోవాలన్నా, బట్టతల రాకూడదన్నా ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తినాలి.

కాల్షియం లోపం ; కాల్షియం లోపంతో కూడా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. కాల్షియం లోపాన్ని నివారించుకోవాలంటే పాలు, పెరుగు, జున్ను వంటి పాల పదార్థాలను తరచుగా తీసుకోవాలి. అప్పుడే కాల్షియం పుష్కలంగా అంది మన రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. తద్వారా జుట్టు రాలిపోవడం ఆగుతుంది. కాల్షియం లోపించడంతోనే ఎముకలు కూడా బలహీనంగా మారతాయని తెలుస్తోంది. దీనికి గాను పాల పదార్థాలను విరివిగా తీసుకుంటూ కాల్షియం లోపం నుంచి బయట పడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

విటమిన్ ఇ ; జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్ ఇ కూడా ఉపయోగపడుతుంది. జుట్టు ఊడిపోతుంటే విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. బాదం పప్పులను తింటే జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు, ఊడిపోకుండా చేసేందుకు కూడా సహాయపడుతుంది. అందుకే ఈ విటమిన్ ఉండే ఆహారాలను ఎక్కువగా తినండి.

ఈ జాగ్రత్తలు అవసరమే ;

ఆరోగ్యవంతమైన జుట్టుకోసం జుట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే రోజూ కాసేపు తలపై మసాజ్ చేయాలి. అప్పుడే తలలో రక్తప్రసరణ మెరుగ్గా జరిగి కుదుళ్లు బలపడతాయి. చక్కెర పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. ఆహారంలో చక్కెర వినియోగం తగ్గించాలి. జంక్‌, ఫాస్ట్‌ఫుడ్‌ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. దీని వల్ల వెంట్రుకల కుదుళ్లలో ఇబ్బందులు ఏర్పడి జుట్టు పెరుగుదలలో సమస్యలు తలెత్తుతాయి. గుడ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, సహజ కొవ్వులు లభిస్తాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.

మ‌ద్య‌పానం, ధూమ‌పానానికి దూరంగా ఉండాలి. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు, పొల్యూష‌న్‌లో తిరిగిన‌ప్పుడు త‌ల‌ను స్కార్ఫ్ లేదా క్యాప్‌ సాయంతో క‌వ‌ర్ చేసుకోవాలి. త‌ల‌స్నానం చేసే ముందు రోజు జుట్టుకు నూనె పెట్టుకుని మ‌సాజ్ చేసుకుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. త‌ల‌ మ‌రీ జిడ్డుగా ఉన్న‌ప్పుడు త‌ప్ప ఎక్కువ రసాయ‌నాలు ఉండే షాంపులు, కండీష‌న‌ర్ల‌ను వినియోగించ‌వ‌ద్దు. ఆయిలీ ఫ్రీ, మైల్డ్ షాంపూల‌ను వాడాలి. త‌ల‌స్నానం చేశాక చిక్కులు తీయ‌డానికి దువ్వెన‌తో బ‌లంగా జుట్టును లాగుతుంటారు. దీనివల్ల కుదుళ్లు చెడిపోయి బ‌ల‌హీనంగా మారుతాయి. త‌ద్వారా జుట్టు రాలే స‌మ‌స్య పెరుగుతుంది.