Nail Care : దేహ సౌందర్యం, చర్మ సంరక్షణ తోపాటు గోర్ల సంరక్షణ ముఖ్యమే? ఇందుకోసం ఇలా చేస్తే సరిపోతుంది!

గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు వాము నూనె వాడితే మంచి ఫలితాలుంటాయి. ఇందుకు రెండు మూడు డ్రాప్స్ వాము నూనె సరిపోతుంది. చిన్న స్పూన్ కొబ్బరి నూనె లేదా జైతూన్ ఆయిల్‌లో వాము నూనె మిక్స్ చేసి గోర్లపై రాయాలి.

Nail Care : దేహ సౌందర్యం, చర్మ సంరక్షణ తోపాటు గోర్ల సంరక్షణ ముఖ్యమే? ఇందుకోసం ఇలా చేస్తే సరిపోతుంది!

Nail Care

Nail Care : ఎదుటి వారి దృష్టి వెంటనే ఆకర్షించే వాటిల్లో చేతి గోళ్లు ఒకటి. నాజూకైన చేతికి అందాన్ని ఇచ్చేది అందమైన గోళ్లే. అందుకే వాటి సంరక్షణను నిర్లక్ష్యం చేయరాదు. గోళ్లని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. గోళ్లు గులాబీ రంగులో ఉంటే రక్తం తగిన స్థాయిలో వేళ్లకి సరఫరా అవుతున్నట్లు, ఆరోగ్యంగా ఉన్నట్లుగా భావించాలి. ఆకుపచ్చ రంగులో ఉంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, గోళ్లు పాలిపోయినట్లు ఉంటే వివిధ రకాల శరీర ఆరోగ్య పరిస్ధితులను కారణంగా చెప్పవచ్చు. గోర్లు విరిగినా లేదా గోర్లకు దెబ్బ తగిలినా లేదా గోర్లు శుభ్రంగా లేకపోయినా ఫంగస్ వ్యాపిస్తుంది.

దేహ సౌందర్యం, చర్మ సంరక్షణ తోపాటుగా గోర్ల సంరక్షణ కూడా అంతే అవసరం. గోర్ల సంరక్షించుకునేందుకు సులభమైన చిట్కాలు పాటించటం ద్వారా వాటిని అందంగా ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు.

వెనిగర్ తో ; వెనిగర్ అనేది యాంటీ మైక్రోబియల్. చర్మంపై ఏ విధమైన ఫంగస్ ఉన్నా దూరం చేస్తుంది. ఒక కప్పు వెనిగర్‌లో 4 కప్పుల నీళ్లు మిక్స్ చేయాలి. ఈ నీళ్లలో చేతులు, కాళ్లను ముంచాలి. 20 నిమిషాల తరువాత చేతులు, కాళ్లను పొడిగుడ్డతో తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల నెయిల్ ఫంగస్ నుండి గోర్లను కాపాడుకోవచ్చు.

అరటి పండుతో : బాగా పండిని అరిపండు గుజ్జును క్యూటికల్స్ రాలిపోయిన వేళ్ళకు అప్లై చేయడం వల్ల ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ లక్షణాలనుఅ అందిస్తుంది. ఇందులో కొద్దిగా క్రీమ్, షుగర్, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి చేతులకు అప్లై చేయడం వల్ల క్యూటికల్స్ సమస్య తగ్గించుకోవచ్చు.

వాము నూనెతో ; గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు వాము నూనె వాడితే మంచి ఫలితాలుంటాయి. ఇందుకు రెండు మూడు డ్రాప్స్ వాము నూనె సరిపోతుంది. చిన్న స్పూన్ కొబ్బరి నూనె లేదా జైతూన్ ఆయిల్‌లో వాము నూనె మిక్స్ చేసి గోర్లపై రాయాలి. ఇలా చేస్తే నెయిల్ ఫంగస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

అలోవెర జెల్ తో ; అలోవెర జెల్ ను చేతులకు , గోళ్ళకు, వేళ్ళకు అప్లై చేయడం వల్ల డ్రైగా మారిన, నొప్పి కలిగించే క్యూటికల్స్ ను నుండి ఉపశమనం కలిగిస్తుంది. గోళ్ళకు మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది . ఇతర ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

పుదీనా జ్యూస్ తో ; పుదీనాను మెత్తగా చేసి, అందులోని రసాన్ని గోళ్ళకు అప్లై చేయాలి. దీన్ని చేతి వేళ్ళకు అప్లై చేయాలి. ఇలా రాత్రుల్లో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా జ్యూస్ లో మెడిసినల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. పీలింగ్ ఫింగర్ టిప్ ను నివారిస్తుంది. స్కిన్ డ్రై నెస్ ను తగ్గిస్తుంది. ఎగ్జిమా మరియు ఇతర స్కిన్ ఆర్డర్స్ ను నివారిస్తుంది.

కొబ్బరి నూనెతో ; కొబ్బరి నూనె ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు చాలా మంచిది. గోర్ల ఆరోగ్యం కోసం కూడా కొబ్బరి నూనె వినియోగిస్తుంటారు. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనెను గోర్లపై నేరుగా అప్లై చేయవచ్చు. దీనివల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్, స్వెల్లింగ్ దూరమౌతుంది.

లెమన్ జ్యూస్ , తేనె తో ; పీలింగ్ క్యూటికల్స్ నివారించుకోవడానికి లెమన్ జ్యూస్ లో తేనె మిక్స్ చేసి, చేతి వేళ్ళకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకుని, తర్వాత మాయివ్చరైజర్ అప్లై చేయాలి.