Paralysis : పక్షవాతానికి అధిక బరువు, మధుమేహం కారణమా?

మదుమేహం వ్యాధి ఉన్నవారు పక్షవాతం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రెండు, మూడు నెలలకు డాక్టర్ల సూచన మేరకు రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు సరైన ఆహారం తీసుకోవాలి.

Paralysis : పక్షవాతానికి అధిక బరువు, మధుమేహం కారణమా?

Paralysis

Paralysis : రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకుంటే పక్షవాతం ముప్పును తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. మన దేశంలో సగటున 10 శాతం మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో పక్షవాతం వస్తోంది. చిన్న వయసులోనే పక్షవాతం రావడానికి ప్రధానంగా జీవనశైలిలో మార్పే కారణమని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారిలో 30 శాతం మంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. పక్షవాతం వచ్చే అవకాశం మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ. అధిక శాతం పురుషులు మద్యపానం, ధూమపానం చేస్తుంటారు. దీంతో పురుషులే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు.

ముఖ్యంగా యువతలో రోజువారి వ్యాయామాలు చేయకపోవటం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, చిన్నతనంలోనే మధుమేహం, ఇలాంటి వన్నీయువతో బ్రెయిన్‌స్ట్రోక్‌ కారణమౌతున్నాయి. మద్యం అలవాటు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు లాంటి వాటితో పక్షవాతం తొందరగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనిషికి ఉండాల్సిన రక్తపోటుకంటే ఎక్కువగా ఉన్నప్పుడు మందులు వాడి అదుపులో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల 45 శాతం మందిలో పక్షవాతాన్ని నియంత్రిచొచ్చని వైద్యులు అంటున్నారు.

మదుమేహం వ్యాధి ఉన్నవారు పక్షవాతం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రెండు, మూడు నెలలకు డాక్టర్ల సూచన మేరకు రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు సరైన ఆహారం తీసుకోవాలి. మందులు ఎల్లప్పుడు వాడి షుగర్‌ను అదుపులో ఉంచుకోవాలి. స్థూలకాయంతో కూడా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. బరువు పెరగకుండా జాగ్రత్త పడితే పక్షవాతానికి చెక్‌పెట్టొచ్చు. స్థూలకాయులు వైద్యుల సూచనలు పాటిస్తూ వ్యాయామం చేయాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.

రక్తంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నవాళ్లు తరచూ రక్త పరీక్షలు చేయించుకోవాలి. వైద్యులను సంప్రదించి మందులను వాడాలి. బీపీ 140/80 కన్నా తక్కుగా ఉండాలి. మధుమేహంతో పాటు ఇతర వ్యాధులు ఉన్నవారు తప్పకుండా బీపీని 130/80 లోపే ఉంచుకోవాలి. రోజుకు 30 నిమిషాల చొప్పున ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. ఆహారంలో ఉప్పు శాతం తగ్గించాలి. అన్ని పోషక పదార్థాలు సమపాళ్లలో తీసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినొద్దు.

ఒకవైపు కాళ్లు, చేతులు, తల పని చేయకపోవడం, ఉన్నట్టుండి పడిపోవడం, తల తిరగడం, మతిమరుపు, మూతి వంకర పోవడమంటే పక్షవాతం వచ్చినట్టే. ఇలాంటి వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. బ్లడ్‌క్లాట్‌ అయితే 4,5 గంటల్లో రోగిని తీసుకొస్తే రక్తం గడ్డకట్టకుండా ఇంజక్షన్‌ ఇవ్వడానికి వీలవుతుంది. వెంటనే రక్త సరఫరా సాధారణంగా మారుతుంది. ఆలస్యం అయితే సమస్య తీవ్రత పెరుగుతుంది.