Rheumatoid Arthritis : రుమటాయిడ్ ఆర్ధరైటిస్ ప్రమాదకరమైనదా!

గుండె స‌మ‌స్య‌లు, గ్యాస్ వ‌ల్ల మాత్ర‌మే కాదు, రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారిలో కూడా ఛాతిలో నొప్పి వ‌స్తుంటుంది. అందువ‌ల్ల ఈ ల‌క్ష‌ణం క‌నిపించినా అనుమానించాల్సిందే. మెడ, చేతులు, వ

Rheumatoid Arthritis  : రుమటాయిడ్ ఆర్ధరైటిస్ ప్రమాదకరమైనదా!

Rheumatoid Arthritis

Rheumatoid Arthritis :  సైలెంట్ కిల్ల‌ర్ గా చెప్పబడే వ్యాధుల్లో రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ అనేది ఒకటి. కుటుంబంలో ఒకరికి ఈ సమస్య ఉంటే ఇతర కుటుంబసభ్యులకు కూడా ఈ రిస్క్ ఉండే అవకాశాలు ఎక్కవగా ఉంటాయి. వంశపారంపర్యంగా ఇది వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీని వల్ల జాయింట్ పెయిన్ వస్తుంది. అలాగే శరీరం మొత్తం డేమేజ్ అవుతుంది. ఈ వ్యాధి చాలా మందికి వ‌స్తోంది. దీని వ‌ల్ల వాపులు, నొప్పులు వ‌స్తాయి. ముఖ్యంగా కీళ్లు వాపుల‌కు గురై నొప్పిగా అనిపిస్తాయి.

రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారిలో మ‌ణిక‌ట్టు, చేతులు, వేళ్ల‌లో స్ప‌ర్శ స‌రిగ్గా ఉండ‌దు. నొప్పిగా ఉంటాయి. ఇది చాలా మందికి వ‌స్తుంది. కంప్యూట‌ర్ల మీద ఎక్కువ‌గా ప‌నిచేసేవారికి ఇలా అనిపిస్తుంది. కానీ రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారిలో కూడా ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. క‌నుక ప‌రీక్ష‌లు చేయించుకుని వ్యాధి నిర్దార‌ణ చేయ‌డం ముఖ్యం. పరీక్షల్లో రుమటాయిడ్ అర్ధరైటిస్ అని తేలితే వైద్యుని పర్యవేక్షణలో చికిత్స పొందటం మంచిది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో సఫర్ అయ్యేవారు కేవలం జాయింట్ పెయిన్స్ తోనే సఫర్ అవుతారు అనుకోవడం పొరపాటు. వారిలో లక్షణాలు జాయింట్స్ కి మాత్రమే పరిమితం కావు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలిగిన దాదాపు 40 శాతం మందిలో జాయింట్ కి సంబంధం లేని లక్షణాలెన్నో కనిపిస్తున్నాయని తేలింది. స్కిన్, కళ్ళు, లంగ్స్, హార్ట్, కిడ్నీస్, సాలివరీ గ్లాండ్స్, నెర్వ్ టిష్యూ, ఎముకలు, రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది.

రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారిలో గుండె స‌మ‌స్య‌లు, గ్యాస్ సమస్యతోపాటు చాతిలో నొప్పి వ‌స్తుంది. ఇలాంటి ల‌క్ష‌ణం క‌నిపిస్తే  అమానించాల్సిందే. మెడ, చేతులు, వెన్నెముక‌ల‌లో నొప్పి వ‌స్తుంటుంది. క‌ళ్ల‌లో నొప్పి ఉన్నా కూడా రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ల‌క్ష‌ణంగా భావించాలి. అతి తక్కువ మందిలో ఈ ల‌క్ష‌ణం క‌నిపిస్తుంది.

వివిధ రకాల కారణాల వల్ల శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. అయితే రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉన్నా కూడా ఆ విధంగా అవుతుంది. రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ వచ్చినవారిలో చేతులు, కాళ్లు త‌ర‌చూ తిమ్మిర్ల‌కు గుర‌వుతుంటాయి. ఆయా భాగాల్లో సూదుల‌తో గుచ్చిన‌ట్లు అనిపిస్తుంది. స్మోకింగ్ తో రుమటాయిడ్ రిస్క్ మరింత పెరుగుతుంది. ఒబెసిటీ కూడా రిస్క్ ఫ్యాక్టరే. ఒబెసిటీతో బాధపడేవారిలో రిస్క్ ఎక్కవనే చెప్పాలి.

క‌నుక ఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. స‌మ‌స్య ఉన్న‌ట్లు తేలితే చికిత్స తీసుకోవాలి. దీంతో ప‌రిస్థితి తీవ్ర‌త‌రం కాకుండా చూసుకోవ‌చ్చు. జీవన విధానంలో మార్పులు చేసుకోవటం ద్వారా ఆర్థరైటిస్ తో బాధపడుతున్నప్పటికీ జీవన నాణ్యతను పెంచేందుకు హెల్ప్ చేస్తాయి. ఎక్సర్సైజ్, విశ్రాంతి, యోగా వంటి వాటి ద్వారా కొంత మేర ఉపశమనం పొందవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో తగినంత విశ్రాంతి అవసరం. సరైన నిద్ర వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. నొప్పితో పాటు అలసట కూడా తగ్గుతుంది.