Pregnant Women : గర్భిణీ స్త్రీలలో మానసిక వత్తిడి కడుపులో శిశువుకు ప్రమాదమా?

మనసును మళ్లించడానికి మిమ్మల్ని మీరు ఏదో ఒక కార్యకలాపంలో లేదా ఇతర పనులలో బిజీగా ఉంచుకోండి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొంత సమయం పాటు వాకింగ్ చేయండి.

Pregnant Women : గర్భిణీ స్త్రీలలో మానసిక వత్తిడి కడుపులో శిశువుకు ప్రమాదమా?

Pregnant

Pregnant Women : గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల మధ్య ఒత్తిడి, కోపం, వంటి లక్షణాలు స్త్రీలో తరచుగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు తక్కువగా ఉంటే పర్వాలేదు. కానీ అవి మరింతగా పెరిగితే డిప్రెషన్‌లోకి వెళుతారు. ఈ మానసిక వత్తిడి కొన్ని వారాలు, నెలల పాటు కొనసాగుతుంది. కానీ అది తీవ్రంగా మారితే తల్లి, బిడ్డ ఇద్దరికీ ఇబ్బందిగా మారుతుంది. అధిక ఒత్తిడి కారణంగా చాలా సార్లు డెలివరీ సమయంలో అనేక రకాల సమస్యలు ఉండవచ్చు. దీంతో పాటు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.

డిప్రెషన్ లక్షణాల విషయానికి వస్తే వర్ణించలేని ఏడుపు, కోపం, చిరాకు, నిద్రలేమి, ఎప్పుడు అలసిపోయినట్లు అనిపించడం, జ్ఞాపకశక్తి బలహీనంగా అనిపించడం, అపరాధ భావన, ఆత్మహత్య గురించి ఆలోచనలు వస్తాయి. డిప్రెషన్‌ని అధిగమించడానికి తొమ్మిది గంటల పాటు నిద్రించాలి. గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. ప్రెగ్నెన్సీ కారణంగా నిద్ర పూర్తి కాకపోతే గంటలు గంటలుగా పూర్తి చేయండి. నిద్ర పూర్తి అయితే మనస్సు రిలాక్స్‌ అవుతుంది. ప్రతికూల భావోద్వేగాలు తక్కువగా అనిపిస్తాయి. ఉదయం, ఖచ్చితంగా కొంత సమయం పాటు ఎండలో కూర్చోండి. దీంతో మీరు విటమిన్ డి పొందుతారు. డిప్రెషన్ కూడా తగ్గుతుంది. పిల్లల ఎముకల అభివృద్ధికి విటమిన్ డి చాలా ముఖ్యమైనది.

మనసును మళ్లించడానికి మిమ్మల్ని మీరు ఏదో ఒక కార్యకలాపంలో లేదా ఇతర పనులలో బిజీగా ఉంచుకోండి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొంత సమయం పాటు వాకింగ్ చేయండి. అలాగే యోగా, ధ్యానాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. నిపుణుల సలహాతో గర్భధారణ సమయంలో యోగా చేయండి. పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి-లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారి తీయును. కుటుంబ సభ్యులు ఆమె పట్ల ఆప్యాయత అనురాగంతో మెలగాలి. మంచి పోషకాహారాన్ని అందించాలి. సమస్య తీవ్రంగా ఉంటే నిపుణుల సలహాతీసుకుని సరైన చికిత్స పొందటం మంచిది.