Vitamin C : శరీరంలో విటమిన్ సి లోపించిందా?…అయితే జాగ్రత్త పడాల్సిందే!….

విటమిన్ సి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ఒకటి. విటమిన్ సి ఎముకల అభివృద్ధికి, రక్తనాళాల ఆరోగ్యానికి గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.

Vitamin C : శరీరంలో విటమిన్ సి లోపించిందా?…అయితే జాగ్రత్త పడాల్సిందే!….

Vitamin C Foods

Vitamin C : మనిషి శరీరానికి విటమిన్ సి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీనిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మనిషి రోగ నిరోధక వ్యవస్ధకు రక్షణ కవచంలా విటమిన్ సి పనిచేస్తుంది. విటమిన్ సి ఆహారపదార్ధాలను రోజు వారి డైట్ లో చేర్చుకునే వారికి రోగాలే దరిచేరవు. ముఖ్యంగా జలుబు, జ్వరం వంటివి రాకుండా విటమిన్ సి చక్కగా సహాయపడుతుంది. ప్రతిరోజూ విటమిన్ సి ఉండే ఆహారాన్ని మహిళలు 75 మిల్లీ గ్రాములు తీసుకోవాలి. అదే పురుషులు అయితే 90 మిల్లీ గ్రాములను తీసుకోవాలి. చర్మ, దంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే విటమిన్ సి చాలా అవసరం. ఇది మీ దంతాలను బలోపేతం చేయడమే కాకుండా, చిగుళ్లను కూడా కాపాడుతుంది.

విటమిన్ సి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ఒకటి. విటమిన్ సి ఎముకల అభివృద్ధికి, రక్తనాళాల ఆరోగ్యానికి గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో కొల్లాజెన్ సరైన ఉత్పత్తికి కూడా ఇది అవసరం. అందుకే విటమిన్ సి లోపం అనేక రకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయానికి దారితీయవచ్చు. విటమిన్ సి లోపం వల్ల శరీరంలో అనేక వ్యాధులు దరిచేరతాయి. విటమిన్ సి లోపం వల్ల చిగుళ్ల రక్తస్రావం సమస్య తలెత్తుతుంది. చర్మం, జుట్టు మరియు కీళ్ల ఆరోగ్యానికి కొల్లాజెన్ అవసరం. నోటి ఆరోగ్యానికి విటమిన్ సి అవసరం. ఇది దంతాలను బలపరుస్తుంది. చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.

థైరాయిడ్ ఆరోగ్యానికి విటమిన్ సి తీసుకోవడం చాలా అవసరం. విటమిన్ సి హారం తక్కువగా తీసుకునే వారిలో హైపర్ థైరాయిడిజం వస్తుంది. పీరియడ్స్ సమస్యలు, బరువు తగ్గడం, అధిక హృదయ స్పందన రేటు, పెరిగిన ఆకలి, భయము, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ సి లోపం వల్ల ఎనీమియా లేదా రక్తహీనత వ్యాధి వచ్చే అవకాశం ఉంది. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గినా లేదా నాణ్యత తగ్గినా ఎనీమియాగా గుర్తించాలి. స్కర్వీ అనేది విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి. దీని ఫలితంగా చిగుళ్లలో గాయాలు, రక్తస్రావం, బలహీనత, బద్ధకం మరియు దద్దుర్లు వంటివి వస్తాయి. అలసట, ఆకలి లేకపోవడం, చిరాకు మరియు కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

విటమిన్ సి లోపాన్ని అధిగమించడానికి సిట్రస్ పండ్లను తీసుకోవడం చాలా ముఖ్యం. తాజా పండ్లు, కాయగూరల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోజూ క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటూ ఉంటే.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. ఆహారంలో పచ్చి కూరగాయలను కూడా చేర్చుకోవాలి. నారింజ, నిమ్మ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, బ్రోకలీ మరియు బంగాళదుంపలు విటమిన్ సి లోపాన్ని అధిగమించడంలో సహాయపడతాయి. మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత విటమిన్ సి సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.