Ghee : ఆరోగ్యానికి నెయ్యి వాడకం మంచిదేనా!..

ఒక గ్లాసు పాలల్లో చెంచా నెయ్యి, చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకుని తాగితే జీర్ణవ్యవస్ధ శుభ్రపడుతుంది. శరీరంలో జీవక్రియను మెరుగుపరచటంలో సహాయపడే మెటబాలిజాన్ని పెంచుతుంది. బరువు

Ghee : ఆరోగ్యానికి నెయ్యి వాడకం మంచిదేనా!..

Ghee

Ghee : భారతదేశంలో వేదకాలం నుండి నెయ్యి వాడకం మనుగడలో ఉంది. భారతీయ వంటకాలు, భోజనాల్లో నెయ్యిది అగ్రస్ధానమనే చెప్పాలి. పాల నుండి వెన్న, మీగడ, నెయ్యి తీస్తారు. అయుర్వేదంలో సైతం నెయ్యిని మంచి ఆహారంగా చెప్తారు. జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచటంతోపాటు, రోగనిరోధక శక్తిని పెంచటంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్తారు. పాలు,పాల పదార్ధాల నుండి తీసే నెయ్యిలో స్వచ్ఛమైన కొవ్వు లభిస్తుంది.

నెయ్యిలో విటమిన్ ఎ,ఇ,కె2,డితో పాటు క్యాల్షియం, సీఎల్ ఏ, ఒమేగా 3 వంటి మినరల్స్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఆహార నిపుణులు సూచిస్తున్న ప్రకారం నెయ్యిని ఒక క్రమపద్దతిలో వాడుకోవాలి. తద్వారా మన శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. నెయ్యిని వాడుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.నెయ్యి మలబద్ధకాన్ని నివారించి శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపు ,మిరియాల పొడిని నెయ్యితో కలిపి తీసుకోవటం వల్ల కడుపులో వచ్చే మంటను తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని దూరం చేయటంలో ఇది బాగా పనిచేస్తుంది.

ఒక గ్లాసు పాలల్లో చెంచా నెయ్యి, చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకుని తాగితే జీర్ణవ్యవస్ధ శుభ్రపడుతుంది. శరీరంలో జీవక్రియను మెరుగుపరచటంలో సహాయపడే మెటబాలిజాన్ని పెంచుతుంది. బరువు తగ్గటంతోపాటు, శక్తిని సమకూర్చటంలో సహాయకారిగా పనిచేస్తుంది.నెయ్యిలో బ్యుటిరిక్ యాసిడ్ అత్యధిక మోతాదులో ఉంటుంది. గట్ లోని బ్యాక్టీరియాకు ప్రొబయాటిక్ గా దోహదం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కె2 వల్ల ఎముకలకు కాల్షియం అందుతుంది. దీని వల్ల కాళ్ళనొప్పులు వంటివి దూరమౌతాయి.

కొవ్వులను తగ్గించి రక్తంలో చక్కెర స్ధాయిలను క్రమబద్దీకరిస్తుంది. ఆకలి కలిగించటం ద్వారా ఆహారం తీసుకునేలా చేస్తుంది. కూరలు, పప్పు తదితర వంటకాలలో నెయ్యిని జోడించటం వల్ల రుచి పెరుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నవారు అంటే షుగర్, అధిక కొలెస్ట్రాల్, అధిక బరువు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు నెయ్యిని వాడకుండా ఉండటమే మంచిది. ఒకవేళ వాడినా వైద్యుల సలహా మేరకు పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది.