Lungs : ఊపిరితిత్తుల్లో నీరు ప్రాణాంతకమా?

నీరు చేరినపుడు ఛాతీలో నొప్పి వస్తుంది. నీరు ఎక్కువ పెరిగినపుడు ఆయాసం,దగ్గు కూడా వస్తుంది. జ్వరం రావొచ్చు. నీరు చేరినట్టు గుర్తించనట్లయితే ఆయాసం పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది.

Lungs : ఊపిరితిత్తుల్లో నీరు ప్రాణాంతకమా?

Lungs

Lungs : శ్వాసవ్యవస్ధలో ప్రధాన భూమిక పోషించేవి ఊపిరితిత్తులు. ఇవి గుండెకు ఇరువైపుల పక్కటెముకల రక్షణలో అమర్చబడి ఉంటాయి. ఆక్సిజన్ ను రక్త ప్రవాహంలోకి పంపించటం, రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ ను బయటకు పంపించటం వంటి ముఖ్యమైన విధులను ఇవి నిర్వర్తిస్తాయి. కొన్ని రకాల ఇన్ ఫెక్షన్ల కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రధానంగా న్యుమోనియా, ఊపిరితిత్తుల కాన్సర్ వంటి వాటి వల్ల ఊపిరితిత్తుల్లో కణజాలం దెబ్బతింటుంది. దీని వల్ల అనే సమస్యలు తలెత్తుతాయి.

ముఖ్యంగా ఊపరితిత్తుల్లో నీరు చేరటం అనే మాట చాలా మంది వినే ఉంటారు. ఛాతీ మధ్యభాగంలో ఊపిరి తిత్తుల చుట్టూ నీరు చేరడం ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. న్యూమోనియాతో ప్రారంభమై క్రమేపి ప్రాణాపాయపరిస్ధితికి దారితీసే అవకాశాలు ఉంటాయి. దీనికి సకాలంలో చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. సాధార ణంగా ఉఛ్వాస నిశ్వాసాలు సాఫీగా జరిగేందుకు ప్లూరా లో కొన్ని ద్రవాలు ఉంటాయి. ఇవి 5 నుండి 15 మిల్లీ లీటర్లు మాత్రమే ఉంటాయి. అపరిమిత మోతాదులు ఇక్కడ ద్రవాలు చేరితే శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రక్కటెముకలు, ఛాతి కండరాలలో చీము , ఇన్‌ఫెక్షన్‌ చేరిన సందర్భంలో ఛాతిలో నీరు చేరుతుంది. చాతికి గాయాలైన సందర్భంలో ఈ పరిస్ధితి ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్వాసకోశ వ్యాధులలోనే కాకుండా గుండె, మూత్రపిండాలు, కాలేయం, పాంక్రియాస్‌ లలో సమస్యలున్నా నీరు చేరుతుంది.

నీరు చేరినపుడు ఛాతీలో నొప్పి వస్తుంది. నీరు ఎక్కువ పెరిగినపుడు ఆయాసం,దగ్గు కూడా వస్తుంది. జ్వరం రావొచ్చు. నీరు చేరినట్టు గుర్తించనట్లయితే ఆయాసం పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది. ఛాతిలో నీరు ఎక్కువ గా ఉండి ఆయాసం వస్తుంటే నీటిని తీయాల్సి వస్తుంది. నీటిని తీసి వేయడం ద్వారా వ్యాధి లక్షణాలు కూడా త్వరితంగా తగ్గుముఖం పడతాయి. తరువాత వైద్యులు సూచించిన మందులు వాడుకుంటే తిరిగి నీరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌తో నీరు ఉందీ లేనిదినిర్థారణ చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో వైద్యుల వద్దకు వెళ్ళటం మంచిది. సకాలంలో చికిత్స అందిస్తే త్వరగా కోలుకునేందుకు అవకాశాలు ఉంటాయి.