Build Strong Bones : బలమైన ఎముకల నిర్మాణానికి రోజువారి ఆహారాల్లో వీటిని చేర్చుకోవటం మంచిది!

వయసు పెరుగుతున్నకొద్దీ ఎముకలకు సంబంధించి అనేక సమస్యలు వస్తాయి. పాత ఎముకల్లోని మృతకణాలు నశిస్తాయి, కొత్తవి పుట్టుకొస్తాయి. ఇది సహజమైన ప్రక్రియగా చెప్పవచ్చు. చిన్నపిల్లలు, యువకులలో ఈ ప్రక్రియ వేగంగా ఉంటుంది. అయితే వయస్సు 30 దాటిన వారిలో మందకొడిగా ఉంటుంది.

Build Strong Bones : బలమైన ఎముకల నిర్మాణానికి రోజువారి ఆహారాల్లో వీటిని చేర్చుకోవటం మంచిది!

It is good to include these in your daily diet to build strong bones!

Build Strong Bones : మనిషి బరువులు ఎత్తాలన్నా, ఏపని చేయాలన్న ఎముక బలం చాలా ముఖ్యమైనది. ఎముకలు బలంగా ఉంటే మనం ధృఢంగా ఉన్నట్లు. ఎముకలు బలహీనంగా మారితే చిన్న దెబ్బ తగిలనా ఎముకలు విరిగిపోతాయి. శరీరంలో కాల్షియం తగ్గినప్పుడు ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. క్రమంగా కీళ్ల సమస్యలు మొదలవుతాయి. శరీర అభివృద్ధికి ఎముకల అభివృద్ధి కూడా ముఖ్యమైనదే. ఇటీవల కాలంలో చాలా మంది చిన్న పిల్లలు కూడా కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల తోపాటు ఎముకల నొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనంతటికి కారణం ఆహారంలో పోషకాల లోపం అని చెప్పవచ్చు. సరైన ఆహారం తీసుకుంటే ఇలాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఎముకలు ధృడంగా ఉండాలంటే విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం ఎంతో ముఖ్యం. కొవ్వు చేపలు ముఖ్యంగా సాల్మన్, ట్రౌట్, ట్యూనా ఇలాంటివి తింటే మంచిది. పాలు నెయ్యి, జున్ను, వెన్న తింటే మంచిది. కూరగాయలు ఎముక ఖనిజ సాంద్రతను పెంచుతాయి. ఆకుపచ్చ, పసుపు పచ్చ కూరగాయలను అధికంగా తీసుకోవడం ద్వారా ఎముక ఖనిజ సాంద్రత పెరుగుతుంది. ఆకు కూరగాయలు అలాగే బ్రోకలీ, క్యాబేజీ, బచ్చలికూర తీసుకోవాలి. గుడ్డు రోజుకి ఒక‌టి తీసుకుంటే సరిపోతుంది. సోయా పాలు, సోయా ఆధారిత ఆహారాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఊబకాయం ఉన్నవారిలో ఎముక సాంద్రత తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బలమైన ఎముకలను నిర్మించడానికి మరియు నిర్వహించడానికి, రోజుకు కనీసం 1,200 కేలరీలను అందించే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పిల్లలలో ఎముక పెరుగుదలకు, వృద్ధులలో ఎముక సాంద్రతను నిర్వహించడానికి జింక్ తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జింక్.. రొయ్యలు, బచ్చలికూర, అవిసె గింజలు, గుమ్మడి గింజల్లో ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కె 2 ఎముక ఏర్పడటానికి సంబంధించిన ప్రోటీన్ అయిన ఆస్టియోకాల్సిన్ ఎముకల నుండి కాల్షియం కోల్పోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. జున్ను, పులియబెట్టిన ఆహారాలు, సోయాబీన్ ఉత్పత్తిలో ఎక్కువగా ఉంటుంది.

వయసు పెరుగుతున్నకొద్దీ ఎముకలకు సంబంధించి అనేక సమస్యలు వస్తాయి. పాత ఎముకల్లోని మృతకణాలు నశిస్తాయి, కొత్తవి పుట్టుకొస్తాయి. ఇది సహజమైన ప్రక్రియగా చెప్పవచ్చు. చిన్నపిల్లలు, యువకులలో ఈ ప్రక్రియ వేగంగా ఉంటుంది. అయితే వయస్సు 30 దాటిన వారిలో మందకొడిగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండాలంటే శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. వాకింగ్‌, జాగింగ్‌, స్విమ్మింగ్‌, రన్నింగ్‌, మెట్లు ఎక్కడం లాంటివి ఇందుకు దోహదపడతాయి. ఈ వ్యాయామాలు ఎముకల కణాల పెరుగుదలకు సాయపడతాయి. ఆరోగ్యకరమైన బరువు ఎముకల బలోపేతానికి ఉపకరిస్తాయి. ఒంటి బరువు ఎక్కువైనా, మరీ తగ్గిపోయినా ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి.