Woman Six shots Covid Vaccine : ఇటలీ మహిళకు పొరపాటున ఒకేసారి 6 డోసుల కొవిడ్ వ్యాక్సిన్ వేశారు.. ఏమైందంటే?

ఇటలీలో 23ఏళ్ల మహిళకు పొరపాటున 6 డోసుల కరోనా వ్యాక్సిన్ ఇచ్చేశారు. ఫైజర్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ఆరు డోసులు తీసుకున్న అనంతరం ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 12 గంటల పాటు ఆస్పత్రిలో పర్యవేక్షణలో ఉన్న ఆమెలో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదు.

Woman Six shots Covid Vaccine : ఇటలీ మహిళకు పొరపాటున ఒకేసారి 6 డోసుల కొవిడ్ వ్యాక్సిన్ వేశారు.. ఏమైందంటే?

Woman Six Shots Covid Vaccine

Italian woman : ఇటలీలో 23ఏళ్ల మహిళకు పొరపాటున 6 డోసుల కరోనా వ్యాక్సిన్ ఇచ్చేశారు. ఫైజర్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ఆరు డోసులు తీసుకున్న అనంతరం ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 12 గంటల పాటు ఆస్పత్రిలో పర్యవేక్షణలో ఉన్న ఆమెలో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదు. సెంట్రల్ ఇటలీలోని టుస్కానీలో నోవా ఆస్పత్రిలో ఒక మహిళకు కరోనా టీకా అందించినట్లు ఆస్పత్రి ప్రతినిధి డేనియెల్లా జియానెల్లి తెలిపారు.



పొరపాటున 6 డోసులు ఇవ్వడంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమైంది. దాంతో ఆమెను అదే ఆస్పత్రిలో 24 గంటల పాటు వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్యంగా ఉన్న ఆమెకు ఎలాంటి ఇతర అనారోగ్య సమస్యలు లేవు. కరోనా టీకా ప్రభావం ఏమైనా ఉంటుందనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా ఆమెను ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షించారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో మహిళను డిశ్చార్జ్ చేసినట్లు జియానెల్లి తెలిపారు.



కరోనా టీకా వేసే హెల్త్ వర్కర్ ఒకరు సీసాలోని మందును మొత్తాన్ని సీరంజిలోకి ఎక్కించాడు. దాదాపు ఆరు మోతాదులు ఉంటుంది. ఆ మొత్తం టీకాను మహిళకు ఇచ్చేసిన తర్వాత తన తప్పును గ్రహించింది హెల్త్ వర్కర్.. అక్కడ ఐదు ఖాళీ సిరంజీలు ఉండటం గమనించింది. తాను ఆరు మోతాదులు ఒకేసారి ఇచ్చినట్టు గుర్తించి కంగారుపడింది. ఇది కేవలం మానవ తప్పిదమేనని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని జియానెల్లి అభిప్రాయపడ్డారు.



ఏప్రిల్ ఆరంభంలో హెల్త్ కేర్ వర్కర్లు, ఫార్మసీ వర్కర్ల అందరికి వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తూ ఇటలీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీకాలపై భవిష్యత్తులో చట్టపరమైన కేసులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఐరోపాలో అత్యధిక కరోనా వ్యాప్తి రేటును నమోదు చేసిన కొన్ని నెలల తరువాత ఇటలీలో కోవిడ్ -19 కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.