వయస్సు పెరిగితే మహిళలల్లో శృంగార వాంఛ తగ్గిపోతోందా? అది అపోహేనా?

  • Published By: vamsi ,Published On : October 3, 2020 / 10:11 PM IST
వయస్సు పెరిగితే మహిళలల్లో శృంగార వాంఛ తగ్గిపోతోందా? అది అపోహేనా?

దంపతుల మధ్య అనేక కారణాల వల్ల కొన్నేళ్ళకు శృంగార జీవితం రసహీనంగా మారిపోతుంది. ఆర్థిక పరిస్థితులు, పిల్లల పెంపకం, ఉద్యోగ వ్యాపారాల కోసం ఎక్కువ సమయం కేటాయించవలసి రావడం.. వాటితో పాటు ఆరోగ్యం సహకరించకోపోవడం.. వర్క్ చేసే స్త్రీలు అయితే, ఇంట్లో, ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువ కావడంతో సవాలక్ష సమస్యలు నెత్తికి ఎత్తుకుని సతమతమవుతూ అలసి పోవడం వంటివాటి వల్ల శృంగారాసక్తి, సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది.



డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులు, ఆస్తమా, లివర్, కిడ్నీ, వివిధ రకాల వ్యాధులు,, వాటికి మందులు వాడడం కారణంగా పరస్పరం ప్రేమ వున్నా కూడా సెక్స్ జీవితంలో మాత్రం కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. శరీర స్పందనలకు, ఐక్యతకు దూరం అవుతూ చాలామంది దంపతులు మానసిక ఒత్తిడితో దూరం అవుతూ ఉంటారు. యాంత్రిక జీవితపు ఒత్తిడి.. శృంగార జీవితాన్ని అనుభవించడంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది.



మిడ్ లైఫ్ మరియు అంతకు మించిన మహిళలు.. సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోతారని చెబుతుంటారు. అయితే సుమారు 15 సంవత్సరాలుగా 3,200 మంది మహిళలను అనుసరించిన కొత్త పరిశోధనల ప్రకారం.. “స్త్రీలు నాలుగింట ఒక వంతు వయస్సుతో సంబంధం లేకుండా సెక్స్ అనేది చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.

ఈ అధ్యయనంలో గణనీయమైన సంఖ్యలో మహిళలు పెద్దవయస్సులో కూడా శృంగారాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు” అని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ థామస్ అన్నారు. సెక్స్ చాలా రిఫ్రెష్ చేస్తుందని, స్త్రీలలో నాలుగింట ఒక వంతు మంది అన్నారు. వీరిలో సెక్స్ కేవలం రాడార్ మీదనే కాదు, చాలా ముఖ్యమైనది. అని అధ్యయనంలో పాల్గొనని NAMS మెడికల్ డైరెక్టర్ డాక్టర్ స్టెఫానీ ఫాబియాన్ చెప్పారు.



స్త్రీలు క్షీణిస్తున్న లైంగిక కోరికను వృద్ధాప్యంలో వచ్చే సహజ భాగంగా చెబుతున్నారు. ప్రేమానురాగాలతో కూడిన స్పర్శ మనిషికి బతకడానికి చాలా అవసరం అని మరికొందరు స్త్రీలు అభిప్రాయపడుతున్నారు. మానసిక సాన్నిహిత్యం, అనురాగం ఒకరిపట్ల ఒకరికున్న బాధ్యతలను తెల్సుకునేందుకు ప్రతి రోజూ లేదా రోజు విడిచి రోజైనా శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం లేదని, అయితే చిన్నచిన్న స్పర్శలు, ఆలింగనాలు, ముద్దులు, ప్రేమ పూర్వకమైన చూపులు ఆనందానిస్తాయి అని కొందరు మహిళలు అభిప్రాయపడ్డారు.



అయితే సెక్స్ ఇష్టపడని వారు.. వ‌య‌సు పెరిగిపోవ‌డం, శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యం దెబ్బతినడం లాంటివే ప్ర‌ధాన కార‌ణాలుగా వెల్లడించారు. అయితే వారు నాలిగింట మూడొంతులు మాత్రమే. అంటే ఓవరాల్‌గా వయస్సు పెరుగుతున్నకొద్దీ, మహిళలల్లో శృంగార వాంఛ తగ్గిపోతోందనేది అపోహ మాత్రమే అని అధ్యయనాలు చెబుతున్నాయి.