కర్వాచౌత్ పండుగపై సెటైర్లతో విరుచుకుపడిన భర్తలు 

  • Published By: sreehari ,Published On : October 17, 2019 / 11:18 AM IST
కర్వాచౌత్ పండుగపై సెటైర్లతో విరుచుకుపడిన భర్తలు 

క‌ర్వా చౌత్‌ (అట్లతద్ది) అంటే.. భర్తలను భార్యలు పూజించే రోజు. ఏడాదిలో దీపావళికి ముందు వచ్చే ఈ అట్లతద్ది పండగను మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. భార్యలకు భర్తలపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకుచ్చేది ఈ ఒక్క రోజే. సంవత్సరమంతా భర్తను మాటల తూటాలతో ఉక్కిరిబిక్కిరి చేసే భార్యలు.. అమితమైన ప్రేమను కురిపించేది పండగ నాడే. ఒకేసారి భార్య ప్రేమ కురిపించే సరికి భర్తలు తట్టుకోలేకపోతారు. ఎప్పుడు గయ్యాలీలా కనిపించే భార్య ఆ రోజు మాత్రం దేవతలా కనిపించే సరికి ఇదే ప్రేమ జీవితాంతం ఉండాలని ప్రతి భర్త కోరుకుంటాడు.

కానీ, అట్లతద్ది రోజున మాత్రమే అని తెలిసి నిరూత్సహపడక తప్పదు. ఎందుకంటే కర్వా చౌత్ పండగ రోజున ప్రత్యేకించి భర్తల కోసం మహిళలందరూ ఉపవాసం ఉంటారు కదా. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా పూజలు చేస్తారు. అలా చేస్తే భర్త ఆయురారోగ్యాలతో ఉంటారని మహిళ‌లు విశ్వసిస్తారు.

స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అంటారు. భర్త ఎప్పుడు పూజింపబడుతాడో అక్కడే ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది అనేది నేటి భర్తల సూత్రం. అట్లతద్ది రోజున భార్యలు భర్తలను ఎలా పూజిస్తారో ట్విట్టర్లో కొన్ని ఫన్నీ మెమీలు వైరల్ అవుతున్నాయి. భర్తలంతా ట్విట్టర్ వేదికగా కర్వాచౌత్ పండుగపై సెటైర్ల మీద సెటైర్లు విసురుతున్నారు.  

* భారతీయ మహిళలు భర్తలను పూజించేది కర్వా చౌత్ పండగ రోజునే.

* భర్తలంతా ఒక రోజు సీఎంలా వెలిగిపోతారు

* కర్వా చౌత్ రోజున భర్త కింగ్ లా ఉంటాడు. మిగతా ఏడాదంతా ఏడుపేలే

* ఈ రోజున ఉపవాసం చేస్తానండీ.. లేదంటే మీరు చనిపోతారండీ
* ఇంట్లో గానీ ఎక్కడ కూడా భర్తలు సంతోషంతో  స్టంట్ చేసేందుకు ప్రయత్నించకండి.

* నా భార్య ఉపవాసం.. అది నాకోసం తట్టుకోలేక పోతున్నా.. పట్టుకోండి.

* నా భర్త జోలికి వస్తే చంపేస్తా.. భార్య అతి ప్రేమ