Jaggrey : జీర్ణ వ్యవస్ధ పనితీరును మెరుగుపరిచే బెల్లం!

బెల్లం శరీరంలోని అనేక రకాల ఎంజైమ్‌లను ఎసిటిక్ ఆమ్లంగా మార్చి, తద్వారా జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. చక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.

Jaggrey : జీర్ణ వ్యవస్ధ పనితీరును మెరుగుపరిచే బెల్లం!

Jaggery

Jaggrey : బెల్లంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. బెల్లంలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలను నివారించటంలో బెల్లం సహాయకారిగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల నుండి శ్లేష్మాన్ని తొలగించడమే కాకుండా లోపలి నుంచి శ్వాస కోశ, జీర్ణవ్యవస్థలను శుభ్రపరచడంలో దోహదపడుతుంది. ప్రతిరోజూ కనీసం ఒక బెల్లం ముక్క తీసుకుంటే శరీరం మొత్తాన్ని శుభ్రపరుస్తుంది. కడుపులో మంట, ఎసిడిటీ లాంటి సమస్యలను అధిగమించడానికి ఒక చిన్న బెల్లం ముక్క తింటే చాలు. భోజనం తర్వాత కొంతమంది బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటారు. అది ఆరోగ్యానికి మంచిది. బెల్లం జీర్ణాశయంలో ఎంజైమ్‌ల విడుదలకు దోహదపడుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు, మలబద్దక సమస్యలు నయమవుతాయి.

ముఖ్యంగా ఎండాకాలంలో శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడడంలో బెల్లం ముఖ్య పాత్ర పోషిస్తుంది. నెలసరి సమయంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలను మహిళలు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారు కొన్ని కాకరకాయ ఆకులు, ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న బెల్లం ముక్క, ఈ మూడింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ఒక వారం రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పొడి దగ్గు, జలుబు, ఆస్తమా.. లాంటి సమస్యల నివారణ కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో బెల్లాన్ని ఉపయోగిస్తారు.

బెల్లం శరీరంలోని అనేక రకాల ఎంజైమ్‌లను ఎసిటిక్ ఆమ్లంగా మార్చి, తద్వారా జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. చక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు పెరగడాన్ని, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక గ్లాసు బెల్లం పానకంలో కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరగనిచ్చి చల్లారనివ్వాలి. ఈ నీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే పొడిదగ్గు తగ్గుతుంది.

రోజూ అల్లం, బెల్లం రెండూ సమపాళ్లలో కలిపి తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లంలో ఉండే మెగ్నీషియం వల్ల రక్తనాళాలు, నాడీవ్యవస్థ పటిష్టమవుతాయి. మైగ్రెయిన్ తలనొప్పి బాధిస్తుంటే బెల్లం, నెయ్యి రెండిటినీ సమపాళ్లలో కలిపి తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లాన్ని ఎండబెట్టాక పొడి చేసి, దాంట్లో కాస్త బెల్లాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయి. మిరియాలపొడి, బెల్లంతో తయారు చేసిన పానకం తాగటం వల్ల ఆకలి పెరుగుతుంది. నాడీ వ్యవస్ధ పనితీరును మెరుగుపరచటంలో బాగా ఉపకరిస్తుంది.