JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!

వీటిలో ఫైబర్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి నేరేడు పండ్లు మంచి ఔషధంగా చెప్పవచ్చు.

JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!

Jamun (1)

JAMUN : వేసవి కాలంలో విరివిగా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒకటి. నేరేడు కాయలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. నిగనిగలాడుతూ, నోరూరించే ఈ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎంతో మంది వీటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. రుచిలో తీపి, పులుపును కలిగి ఉంటుంది. నేరేడు పండ్లలో మెగ్నీషియమ్, క్యాల్షియమ్, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. అలాగే నేరేడు కాయలలో నియాసిన్, విటమిన్‌సి, విటమిన్‌బి కాంప్లెక్స్‌లోని విటమిన్‌ బి6, రైబోఫ్లేవిన్, సమృద్ధిగా లభిస్తాయి.

నేరేడు పండ్లను తీసుకోవడం వలన రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. నేరేడు పండ్లలో పొటాషియమ్‌ అధికంగా ఉండడం వలన నేరేడు పండ్లు గుండెజబ్బులను, గుండెపోటును కూడా నివారిస్తుంది. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు నేరేడు పండ్లు తీసుకోవడం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. దంతాలు, చిగుర్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో నేరేడు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ పండ్లలో ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది. వీటిలో ఫైబర్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి నేరేడు పండ్లు మంచి ఔషధంగా చెప్పవచ్చు.

నేరేడు పండ్లు తినగా మిగిలిన విత్తనం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నేరేడు పండ్ల గుజ్జు సారానికి క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. కాలేయంలో బైల్ జ్యూస్ ఉత్పత్తి తగ్గినప్పుడు కలిగే ఇబ్బందులను తొలగించటంలో నేరేడు పండ్లు సహాయకారిగా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

నేరేడు పండ్లు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అతిగా తినటం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అధిక రక్తపోటు ఉన్న రోగులకు ప్రయోజనం చేకూర్చే మాట నిజమే అయినప్పటికీ అతిగా తింటే మాత్రం రక్తపోటు ప్రమాదకర స్ధాయికి పడిపోయే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అధిక మోతాదులో పండ్లు తింటే మలబద్ధకం సమస్యలు తలెత్తుతాయి. మొటిమలతో సహా చర్మ సమస్యలను కలిగిస్తాయి. ఉబ్బసం ఉన్నవారు నేరేడు పండ్లు అతిగా తినటం వల్ల ఊపరి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.