Jowar Roti : అధిక కొవ్వులను తగ్గించే జొన్నరొట్టె

నరాల బలహీనతను పోగొట్టి రోగనిరోధక శక్తి పెరగటానికి జొన్నరొట్టె బాగా ఉపకరిస్తుంది. మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలకు జొన్న రొట్టెలు ఉపకరిస్తాయి.

Jowar Roti : అధిక కొవ్వులను తగ్గించే జొన్నరొట్టె

Jowar Roti

Jowar Roti : కోవిడ్ తరువాత ప్రజల ఆహారపు అలవాట్లో మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెరగటంతో తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. పాతరోజుల్లో పాపులారీటీ సంపాదించుకున్న ఆహారాలవైపు మళ్ళుతున్నారు. తమ రోజు వారి ఫుడ్ లో బలవర్ధకమైన ఆహారాలు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో జొన్నరొట్టెల వాడకం బాగా పెరిగింది. ఇంతకుముందు చపాతీ మాత్రమే తినేవాళ్లలో చాలా మంది జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడుతున్నారు. దీనికి కారణం జొన్న రొట్టెలు చాలా బలవర్ధకమైన ఆహారం కావటమే.

జొన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఎన్నో అత్యవసర పోషకాలు ఉన్నాయి. షుగర్ పేషెంట్లకు జొన్న రొట్టె చాలా మేలు చేస్తుంది. జొన్నరొట్టెలు తినటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎల్‌డీఎల్‌ తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే ఐరన్‌, కాల్షియం, విటమిన్‌ బి, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటివి చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. జీర్ణక్రియనూ మెరగుపరటంలో అద్భుతంగా పనిచేస్తాయి.

రాత్రిపూట అన్నం తింటే బరువు పెరుగుతామని ఆందోళన చెందుతున్నవారు జొన్న రొట్టెలను తినటం మంచిది. జొన్నలను రోటీ రూపంలో మాత్రమే కాదు ఇడ్లీ, దోశ రూపంలో కూడా తినొచ్చు. బరువు తగ్గేందుకు జొన్నరొట్టెలు బాగా ఉపకరిస్తాయి. శరీరంలో రక్తప్రసరణను మెరుగు పర్చటంతోపాటు, రక్త హీనతను తొలగిస్తాయి. జొన్న రొట్టెల కారణంగా శరీరానికి అధిక మోతాదులో ఫైబర్ అందుతుంది. జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

నరాల బలహీనతను పోగొట్టి రోగనిరోధక శక్తి పెరగటానికి జొన్నరొట్టె బాగా ఉపకరిస్తుంది. మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలకు జొన్న రొట్టెలు ఉపకరిస్తాయి. అంతేకాకుండా జొన్నలతో చేసిన ఆహారాలను తరచూ తిసుకుంటుంటే అధిక బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. చపాతీల మాదిరిగానే జొన్నరొట్టెలను సులభంగా తయారు చేసుకోవచ్చు. .

జొన్నరొట్టె తయారీ విధానం…

ఒక గిన్నెలోకి జొన్న పిండిని తీసుకొని అందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని ముద్దలా చేయాలి. తర్వాత చపాతీ తరహాలోనే పిండిని చిన్న ముద్దలుగా చేసి వీటిని కాటన్‌ క్లాత్‌పై పెట్టి, చేతితో నొక్కుతూ రోటీల్లాగా తయారు చేసుకోవాలి. అనంతరం ఇనుప పెనంపై వేసి కాల్చాలి. ఏదైనా కూర, చట్నీతో కలిపి ఈ రొట్టెలను తీసుకోవచ్చు.