రోజుకు 11నిమిషాల ఎక్సర్‌సైజ్.. లైఫ్ టైం పెంచడం ఖాయం

రోజుకు 11నిమిషాల ఎక్సర్‌సైజ్.. లైఫ్ టైం పెంచడం ఖాయం

Exercise a day: 11నిమిషాల ఎక్సర్‌సైజ్ మీ లైఫ్‌కు బోనస్ టైం యాడ్ చేస్తుంది. అది గడ్డకట్టే చలి వాతావరణం అయినా.. క్లోజ్‌డ్‌గా ఉండే జిమ్ లలోనైనా మీ గోల్స్ మీరు సాధించొచ్చు. చిన్న ఎక్సర్‌సైజ్ సుదీర్ఘ ఫలితాలను రాబడుతుంది. తక్కువలో తక్కువ 11నిమిషాలు చేస్తే చాలు లైఫ్ స్పాన్ పెంచేసుకోవచ్చు. అంటే చిన్నపాటి యూట్యూబ్ వర్కౌట్ లేదా తిన్న తర్వాత కాసేపు నడవడం అంటే ఓ 11నిమిషాల పాటు తిరగడం అనేది ట్రిక్ అని చెబుతున్నారు నిపుణులు.

చాలా స్టడీలు మీలో మోర్టాలిటీ బెనిఫిట్స్ కోసం రోజూ 75నిమిషాల ఎక్సర్‌సైజ్ కరెక్ట్ అని చెబుతున్నాయి. వారి యాక్చువల్ యాక్టివిటీ లెవల్స్ సరిగా గుర్తుండకపోవడం వల్ల కొన్ని స్టడీలు ఫెయిల్ అవ్వొచ్చు. నార్వే స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ యాక్టివిటీలను మానిటర్ చేసే ఎక్సర్‌సైజ్‌ను ట్రాక్ చేసింది. వారితో పాటు ఎటువంటి ఎక్సర్‌సైజ్‌ చేయనివారి డేటాను పరిశీలించింది.

ఇందులో ఎవరైతే 35నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్‌ చేసేవారో వారికి చాలా బెనిఫిట్స్ కనిపించాయి. అందులో 11నిమిషాలు ఎక్సర్‌సైజ్‌ చేసిన వారిలో గమనించదగ్గ మార్పులు కనిపించాయి. ఇందులో రోజూ కొద్ది సార్లు కూర్చొని లేవడం (గుంజీళ్లు లాంటివి) చేయడం వల్ల మంచి ఫలితాలు ఎదుర్కోవచ్చు. దాంతో పాటు కొద్ది దూరం నడవడం కూడా బెనిఫిట్ అని నిపుణులు అంటున్నారు.