Custard Apple : శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటానికి ఈ పండు ఒక్కటి చాలు!

సీతాఫలంలో పొటాషియంలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే హైపర్‌టెన్షన్‌ ఉన్నవారు ఈ ఫలం తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తహీనత ఉన్నవారికి సీతాఫలం చాలా మంచిది.

Custard Apple : శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటానికి ఈ పండు ఒక్కటి చాలు!

Just one fruit is enough to give the body instant energy!

Custard Apple : సీతాఫలం అంటే అందరూ ఇష్టంగానే తినే పండు. ఎందుకంటే దీని రుచి అంతా బాగుంటుంది. సీతాఫలం గుజ్జు ఆకులు, గింజలు ప్రతి ఒక్కటి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసి అద్భుతమైన శక్తి ఈ పండుకి ఉన్నది. ఈ పండు సంజీవిని లాగా ఉపయోగపడుతుంది. ఈ పండు తీసుకున్న వెంటనే శక్తి వస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి , అలాగే మెగ్నీషియం ఫాస్ఫరస్ విటమిన్ సి ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఖనిజాలు, విటమిన్లు తో పాటుగా పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి. క్యాలరీల తో పాటు మాంసంకృతులు కూడా పుష్కలంగా లభిస్తుంటాయి.

సీతాఫలం పండుతో ఆరోగ్య ప్రయోజనాలు ;

1 ఈ పండు గుజ్జు తీసుకోవడం వల్ల నోట్లో జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి. దీనివలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కణాల క్షీణతకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ విటమిన్ సి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పండు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది.

2.జుట్టు మరియు చర్మ సంరక్షణకు ఈ సీతాఫలంలో ఉండే విటమిన్ ఏ చాలా బాగా సహాయపడుతుంది. శీతాకాలంలో తీసుకోవడం వలన మలబద్దకాన్ని పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

3. ఈ పండు విత్తనాలను పొడి చేసుకుని తలలో పేలును పోగొట్టుకోవచ్చు. అలాగే ఈ ఆకులను రసంగా చేసి గాయాలకు పెట్టడం వలన గాయాలు తొందరగా తగ్గిపోతాయి.

4. సీతాఫలంలో పొటాషియంలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే హైపర్‌టెన్షన్‌ ఉన్నవారు ఈ ఫలం తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తహీనత ఉన్నవారికి సీతాఫలం చాలా మంచిది.

5. సీతాఫలం తినటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్లవాతాన్ని, అర్థరైటీస్‌ వంటి ఎముకల వ్యాధులను నివారిస్తుంది. లివర్‌ కేన్సర్, మెదడులో ట్యూమర్స్, బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా ఉపయోగపడుతుంది.

6. కళ్ల ఆరోగ్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. బీ6 విటమిన్‌ ఎక్కువగా ఉండటం వల్ల అస్తమా రాకుండా ఉంటుంది. బలహీనత, ఒత్తిడితో బాధపడుతున్నవారికి, డిప్రెషన్‌కు కూడా మందులా పనిచేస్తుంది. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను కొలమానంగా పనిచేస్తుంది. కేలరీ కూడా ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది.

7. సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు.