రైతులు కావలెను : జీతం 20 వేలు

  • Published By: madhu ,Published On : March 2, 2019 / 04:26 AM IST
రైతులు కావలెను : జీతం 20 వేలు

అవును రైతులు కావలెను. నిజంగానే వారికి రైతులు కావాలంట. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కావలెను..ఆకర్షణీయమైన జీతం కూడా ఇస్తామంటోంది ఓ సంస్థ. ఊరికే చెప్పడం లేదు. నిజంగానే. వ్యవసాయం మీద ఆసక్తి ఉన్నవారు..అందులో ప్రకృతి వ్యవసాయం మీద పట్టున్న వారికి ఫస్ట్ ప్రియార్టీ ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే.
Read Also : మళ్లీ తెగబడిన పాక్ రేంజర్లు : ముగ్గురు భారతీయులు మృతి

గిట్టుబాటు ధర రాక, పండించిన పంటకు సరియైన ధర రాకపోవడం ఇతరత్రా సమస్యలతో రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. దీనితో చాలా మంది వ్యవసాయాన్ని వదిలి..ఇతర పనుల వైపు మళ్లుతున్నారు. సంతానాన్ని సైతం ఉద్యోగాల వైపు మళ్లిస్తున్నారు కొంతమంది రైతులు. 

వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ఓ సంస్థ నడుం బిగించింది. అదే కోయంబత్తూరుకు చెందిన keeraikadai తమిళనాడుకు చెందిన సంస్థ ఈ ఆఫర్ ప్రకటించింది. సేంద్రీయ వ్యవసాయంపై మక్కువ చూపిస్తోంది. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం, కొత్తసాగు విధానాలు కనిపెట్టేందుకు ఈ సంస్థ ఆసక్తి చూపుతోంది. సేంద్రీయ ఉత్పత్తులను మార్కెట్లో అందిస్తోంది. ఆన్ లైన్‌లో కూరగాయాలను సేల్ చేస్తోంది. 
Read Also : ఈ పరీక్షలు పాసైతేనే : అభినందన్‌ను ఏం చేస్తారు

keeraikadai సంస్థ సేంద్రీయ పంటల సాగులో పలు ఇబ్బందులు పడుతోంది. తగినంత మంది రైతులు లేకపోవడంతో పై ప్రకటన విడుదల చేసింది. మంచి జీతం, భోజనం, వసతి కూడా కల్పిస్తామని వెల్లడించింది. ప్రతి నెలకు రూ. 15 వేల నుండి రూ. 20వేల వరకు జీతాలు ఇస్తామని, అంతేగాకుండా ఉచిత భోజనం ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. సహజసిద్ధ ఆహారాన్ని సమాజానికి అందించే వారి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. 

Read Also : ఉగ్రవాదులపై ఫోకస్ : జమాతే ఇస్లామీ సంస్థ బ్యాన్