Kiwi Fruit : రక్తపోటును నియంత్రించి, కొవ్వును కరిగించే కివీ పండు!

ఇందులో ఉండే పీచు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. ఫలితంగా అధిక కొలెస్ట్రాల్‌ కూడా అదుపులోకి వస్తుంది. సహజసిద్ధ కాగ్యులెంట్‌: ఈ పండుకు రక్తాన్ని పలుచన చేసే గుణముంది.

Kiwi Fruit : రక్తపోటును నియంత్రించి, కొవ్వును కరిగించే కివీ పండు!

Befunky Photo (1)

Kiwi Fruit : చైనా గూస్‌బెర్రీగా పిలిచే కివీ పండులో ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉన్నాయి. ఔషదగుణాలను కలిగి ఉండటంతో దీనిని మందుల తయారీలో సైతం ఉపయోగిస్తున్నారు. పుల్లటి రుచిని కలిగి ఉండే ఈపండులో నిమ్మకాయ కంటే సి విటమిన్ అధికంగా మోతాదులో ఉంటుంది. పోషకాలు అధికంగా, కేలరీలు తక్కువగా ఉండే కివీ పండును బరువు తగ్గాలనుకునే వారు తీసుకోవచ్చు. పొటాషియం, ఫోలేట్‌, ఫైబర్‌, విటమిన్‌ సి, కెలను కలిగి ఉండే కివి పండు అన్ని వయసుల వారికీ ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది.

కివీలో ఉండే పీచు, పెక్టిన్‌లు పేగుల ఆరోగ్యాన్ని ప్రేరేపించి, మలబద్ధకాన్ని నివారిస్తాయి. దీన్లోని పుష్కలమైన విటమిన్‌ సి శ్వాసకోశ వ్యవస్థ మొత్తానికీ సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మరియు శ్వాస తీసుకునేటప్పుడు వచ్చే గురక లాంటి శబ్దాన్ని కూడా తగ్గించటంలో సహాయపడుతుంది. వారానికి రెండు కివి పండ్లు తినగలిగితే ఉబ్బసం ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇందులో ఉండే పీచు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. ఫలితంగా అధిక కొలెస్ట్రాల్‌ కూడా అదుపులోకి వస్తుంది. సహజసిద్ధ కాగ్యులెంట్‌: ఈ పండుకు రక్తాన్ని పలుచన చేసే గుణముంది. కాబట్టి గుండె సమస్యలున్నవాళ్లు ఈ పండును తినడం వల్ల గుండె పోటుకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. కివీ లో ఉండే ఆంటీ ప్లేట్లెట్ గుణం కారణంగా రక్తం గడ్డ కట్టకుండా కాపాడటంలో సహాయపడుతుంది. రోజుకి మూడు కివీ పండ్లు తీసుకోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. కివీ ఫ్రూట్ లో ఉండే పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.

కివీ లో ఉండే విటమిన్ కె , కాల్షియం ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. మన శరీరం విటమిన్ కె ను ఎముకల నిర్మాణానికి ఉపయోగపడే ప్రోటీన్లను తయారు చేయడానికి ఉపయోగిస్తుంది. విటమిన్ కె ఆస్టియోపొరాసిస్ అనే ఎముకల రోగం నుంచి కూడా కాపాడటంలో సహాయపడుతుంది. కివీ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ల కు వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి లో ఉండే అంటి యాక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతాయి. చర్మ ఆరోగ్యానికి సహాయపడే ముఖ్యమైన న్యూట్రియంట్ కొల్లాజిన్ తయారీలో కివీ ఫ్రూట్ లో ఉండే విటమిన్ C ముఖ్య పాత్ర వహిస్తుంది.