Nutmeg Powder : ఒక చిటికెడు జాజికాయ పొడి ఒత్తిడిని నియంత్రించటంలో ఎలా సహాయపడుతుందో తెలుసా?

ఈ తీపి, సుగంధ మసాలా మెగ్నీషియం, మాంగనీస్ మరియు రాగి వంటి ఖనిజాల తోపాటు, B1, B6 వంటి ఇతర ముఖ్యమైన విటమిన్‌లను కలగి ఉంది. జాజికాయ పొడిని పాలతో కలిపిన సమ్మేళనం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Nutmeg Powder : ఒక చిటికెడు జాజికాయ పొడి ఒత్తిడిని నియంత్రించటంలో ఎలా సహాయపడుతుందో తెలుసా?

Nutmeg Powder : జాజికాయను మాంసాహార వంటల్లో రుచికి, సువాసనకు ఉపయోగిస్తారు. తమలపాకుల్లో వాడతారు. జాజికాయ వంటలకు రుచిని, వాసన తీసుకురావడమే కాకుండా మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలోనూ దీన్ని అనేక వ్యాధుల చికిత్సలో వాడతారు.

జాజికాయలో ఫైబర్, థియామిన్, విటమిన్ బి 6, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిని ఆహారంలో ఉపయోగించటం వల్ల అనేక ఉపయోగాలు కలుగుతాయి.

జాజికాయ మానసిక స్థితిని రిఫ్రెష్‌ చేస్తుంది. బద్ధాకాన్ని పోగొడుతుంది. ఇది యాంటిడిప్రెసెంట్ డ్రగ్స్ లాగా పనిచేసి డిప్రెషన్, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. మిరిస్టిసిన్ అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. అల్జీమర్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేయడానికి తోడ్పడుతుంది.

జాజికాయలో అడాప్టోజెన్ లక్షణాలు ఉన్నాయి, ఇది శరీర అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. ఒక వైపు ఇది మీ నరాలను సడలించడంలో మరియు నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. మరోవైపు జాజికాయ మెదడు స్టిమ్యులేటర్‌గా పని చేస్తుంది, ఇది చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది. మరియు మానసిక స్థితిని పెంచడంలో సహాయపడుతుంది.

ఈ సుగంధ మసాలా అనేక పురాతన సంస్కృతులలో భాగం. పురాతన గ్రీకు మరియు రోమన్ సంస్కృతి ప్రకారం, జాజికాయ మెదడుకు టానిక్‌గా ఉపయోగించబడింది. ఇది నిరాశ మరియు ఆందోళనను నయం చేయడంలో తోడ్పడుతుంది. జాజికాయ నూనెకు ఒత్తిడి, ఆందోళన మరియు అలసటను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

బిఎమ్ సీ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధనలో ‘మహిళల వయాగ్రా’గా పేర్కొనబడింది. దాని కామోద్దీపన కోసం కూడా ఉపయోగించబడింది. ఆయుర్వేదం ప్రకారం, గోరువెచ్చని పాలలో జాజికాయను వేసుకుని తీసుకోవటం వల్ల నరాలు విశ్రాంతి తీసుకోవడం ద్వారా నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.

ఈ తీపి, సుగంధ మసాలా మెగ్నీషియం, మాంగనీస్ మరియు రాగి వంటి ఖనిజాల తోపాటు, B1, B6 వంటి ఇతర ముఖ్యమైన విటమిన్‌లను కలగి ఉంది. జాజికాయ పొడిని పాలతో కలిపిన సమ్మేళనం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

నిద్ర మరియు జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే జాజికాయ లాగా పాలు కూడా మెదడు యొక్క అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. సెరోటోనిన్‌ను విడుదల చేస్తాయి, ఇది నరాలను సడలించడంలో సహాయపడుతుంది. నిద్రను ప్రేరేపిస్తుంది.

జాజికాయలో అడాప్టోజెన్ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీర అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. ఒక వైపు ఇది మీ నరాలను సడలించడంలో, నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని పెంచడంలో సహాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దాని వాసన నరాలను ప్రశాంతపరుస్తుంది.

అయినప్పటికీ, జాజికాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన, దడ మరియు భ్రాంతులు వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సాధారణ మసాలా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఏర్పడే మూడ్ స్వింగ్‌లను కూడా మెరుగుపరుస్తుంది.

పాలు లేదా టీలో చిటికెడు జాజికాయను జోడించడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఒక రోజులో చిటికెడు కంటె ఎక్కువ మోతాదులో తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.