Ladies New Fashon: బ్లౌజులపై దేవుళ్ళ డిజైన్లు.. పిచ్చ పీక్స్ కి చేరిందా?

జిహ్వకో రుచి.. పుర్రెకో రిమ్మ తెగులు.. ఇలాంటి సామెతలు ఎప్పుడైనా విన్నారా? లైఫ్ లో ఏదో ఒక క్షణంలో వినే ఉంటారులెండి. ఏదైనా వింత వింత కోరికలు.. సమాజానికి భిన్నంగా ఆలోచనలు

Ladies New Fashon: బ్లౌజులపై దేవుళ్ళ డిజైన్లు.. పిచ్చ పీక్స్ కి చేరిందా?

Ladies New Fashon

Ladies New Fashon: జిహ్వకో రుచి.. పుర్రెకో రిమ్మ తెగులు.. ఇలాంటి సామెతలు ఎప్పుడైనా విన్నారా? లైఫ్ లో ఏదో ఒక క్షణంలో వినే ఉంటారులెండి. ఏదైనా వింత వింత కోరికలు.. సమాజానికి భిన్నంగా ఆలోచనలు చేసే వారి గురించి చెప్పేప్పుడు ఇలాంటి సామెతలు వింటుంటారు. అయితే.. ఇప్పుడు ఫ్యాషన్ ప్రియులను కూడా ఈ జాబితాలో చేర్చాలేమో అనిపిస్తుంది. అందరినీ ఆ గాటిన కట్టేయలేం కానీ.. అందరిలోకి తామే స్పెషల్ గా కనిపించాలనే ఆతృతలో కొందరు ఇప్పటికే హద్దులు చెరిపేసి అరకొర దుస్తులలో అంగాంగ ప్రదర్శన చేసేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పే రైట్స్ కూడా మనకు లేవాయే.. ఒకవేళ అలా చెప్తే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో ఏమో అనుకోని మనమూ మౌనంగానే ఉండిపోతున్నాం. కానీ ఫ్యాషన్ పేరుతో రోజుకో విధంగా చిత్ర విచిత్రమైన డిజైన్లు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆడెమ్మ బడవ నిన్నగాక మొన్న వచ్చిన కరోనా మాస్కులకే డిజైన్లు నేర్పిన ఘనత మన సొంతమైతే.. ఇప్పుడు ఈ పిచ్చ పీక్స్ కి చేరిందా అనేలా ఆడవారు ధరించే బ్లౌజులు మీద దేవుళ్ళ డిజైన్లు వేసి ఇదొక కొత్త ట్రెండ్ అనేలా చేస్తున్నారు. బ్లౌజులు మీద చేసే ఈ డిజైన్లకు ఇప్పుడు డిమాండ్ అంతకంతకు పెరిగిపోతూనే ఉంది.

Blouse2

Blouse2

ప్రస్తుతం మన ఆడ లేడీస్ ధరించే బ్లౌజుల మీద వెయ్యి నుండి లక్షల వరకు విలువ చేసే డిజైన్లు ఉన్నాయట. ఎవరి స్థోమతకు తగ్గట్లు వారు చేయించుకొనే ఈ డిజైన్లలో ఇప్పుడు దేవుళ్ళ ఆకారంలో చేసే డిజైన్లే కొత్త ఫ్యాషన్. బ్లౌజులు వెనుక భాగంలో ఎలాగూ వారికి కావాల్సినంత స్పేస్ ఉంటుంది కనుక డిజైనర్లు ఈ కొత్త ఫ్యాషన్ కు తెరలేపగా రాముడు నుండి కృష్ణుడి వరకు ఏ దేవుడిని, దేవతను వదలకుండా.. ఎవరికి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ చేసి ఇస్తున్నారు. ఎంచక్కా ఎంబ్రాయిడ్ వర్క్ తో పాటు తళుకులు, బెళుకులతో వారి క్రియేటివిటీ మొత్తం ఉపయోగించి ఈ డిజైన్లు చేసి పెడుతున్నారు. ఈ బ్లౌజులు ధరించిన ఆడవారి వీపు భాగంలో ఈ దేవతల డిజైన్లు కనిపిస్తుండగా కొందరు ఇదెక్కడి పోయేకాలంరా బాబు అని తిట్టుకుంటుంటే.. మరికొందరు కాదేదీ ఫ్యాషన్ కు అనర్హం అనేలా పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇది చూసిన కొందరు మహిళామణులు ఎంత త్వరగా వీలైతే అంతగా అర్జెంట్ ఇదే తరహాలో ఒక డిజైన్ బ్లౌస్ కుట్టించేయాలని తెగ ఆరాటపడిపోతుంటే.. కాస్త భక్తి, దైవత్వం విలువ తెలిసిన మహిళలు మహా పాపం.. మహా పాపం అని లెంపలేసుకుంటున్నారు.

Blouse3

Blouse3

ఇప్పటి వరకు దేవుళ్ళకే ఫ్యాషన్ నేర్పించాలని మన వారు ప్రయత్నించేవారు. అంటే ఉదాహరణకు గణేష్ ఉత్సవాల సమయంలో ఊరూరా వెలిసే విగ్రహాలను గుర్తు చేసుకోవాలి.. గబ్బర్ సింగ్ వినాయకుడు, బాహుబలి వినాయకుడు అంటూ వినాయకుని అసలైన ఆకారం ఏదో కూడా ప్రజలు మర్చిపోయేలా చేశారు. సూటు, బూటేసిన వినాయకులను పెట్టి మన వెర్రి భక్తులు దేవుడికే ఫ్యాషన్ నేర్పించామని మురిసిపోతే.. ఇప్పుడు వారి ఫ్యాషన్ కోసం దేవుడిని వాడేసుకుంటున్నారు. ఆ మధ్య కాలంలో అమెరికాలో చెప్పులు, బాత్ రూమ్ బేసిన్ షీట్స్ మీద దేవుళ్ళ డిజైన్లు రావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆ తర్వాత అదే అమెరికాలో మహిళలు ధరించే లెగ్గిన్స్ మీదా దేవుళ్ళ డిజైన్లు ముద్రించడంతో మరో వివాదం రేగింది. కాలిఫోర్నియాకి చెందిన స్కార్లెట్స్ లౌంజ్ అనే ఆన్లైన్ రిటైలర్ సంస్థ విష్ణు, శివ, బ్రహ్మ, గణేష్, కృష్ణ, కాళి మాతలకి చెందిన ఫొటోలతో కూడిన లెగ్గిన్స్‌ అమ్మకానికి పెట్టింది. దీంతో అమెరికాలోని హిందువులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఆ సంస్థ తమ ఈ కామర్స్ సైట్ నుండి ఆ ఉత్పత్తులను తొలగించింది.

Blouse5

Blouse5

అయితే.. ఇప్పుడు ఏకంగా మన భారత దేశంలో ఆడవారు ధరించే బ్లౌజులు మీద ఈ తరహా దేవతా డిజైన్లు రావడం విశేషం. అమెరికాలో అదే ఆడవారి బట్టల మీద దేవతల డిజైన్లు ముద్రిస్తే అక్కడ హిందువులు వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు హిందూ సంప్రదాయానికి విలువనిచ్చే మన భారత దేశంలో.. నిత్యం పూజించే విగ్రహాల డిజైన్లనే తమ జాకెట్ల మీదకి తెచ్చుకునేందుకు ఇష్టపడుతున్నారంటే వీరి ఫ్యాషన్ క్రియేటివిటీని ఆహా అనాలో.. మన దేవతామూర్తులను కించపరిచినట్లుగా మొత్తుకోవాలో అర్థంకాని పరిస్థితి. మరి ఈ కొత్త ఫ్యాషన్ ట్రెండ్ కేవలం బ్లౌజ్ వరకే ఆగుతుందా.. లేక ఇంకా ఏ దుస్తుల మీదకైనా చేరుతుందా అన్నది చూడాల్సి ఉంది.