Lady Finger : మధుమేహులకు బెండకాయ దివ్యౌషధమే!

బెండకాయలు, గింజలను ఎండలో ఆరబెట్టి పిండిలా చేసి ఆహారంలో కలిపి తీసుకోవాలి. బెండలో ఫ్లెవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Lady Finger : మధుమేహులకు బెండకాయ దివ్యౌషధమే!

Lady Finger (1)

Lady Finger : లేడీ ఫింగర్‌గా పిలవబడే బెండకాయలు ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. షుగర్ రోగులకు బెండకాయలు దివ్యౌషదంగా ఉపయోగపడతాయి. చక్కెర వ్యాధితో బాధపడేవారు వివిధ రకాల ఆహారాలకు దూరంగా ఉంటూ ఉంటారు. రక్తంలోని చక్కెర స్థాయిని కంట్రోల్‌ చేసేందుకు ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉండటం అన్నది చాలా కష్టంతూ కూడుకున్నదే. అయితే మధుమేహులు సైతం బెండకాయను తినటం వల్ల ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒకప్పుడు బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని అంటుండేవారు. అయితే ప్రస్తుతం బెండకాయలు తింటే షుగర్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

బెండలో పైబర్‌, విటమిన్స్‌ మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎ,బి! , బి2. బి3, బి1, సి, ఈ కె విటమిన్లు ఉంటాయి. అలాగే కాల్లియం, అరన్న్‌ మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ పొటాషియం, జింక్‌ వంటి మినరల్స్‌ లభిస్తాయి. ఫైబర్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. తక్కువ క్యాలరీలు గల బెండకాయలు షుగర్‌ పేషంట్స్‌ కే కాదు. అందరికీ మంచి ఆరోగ్యాన్నిఇస్తుంది. మధుమేహంతో బాధపడే వారు బెండకాయలను తమ డైట్‌లో భాగం చేసుకోవటం వల్ల శరీరంలో గ్లూకోజ్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేయడంతోపాటుగా, మలబద్దకం వంటి సమస్యలతో పోరాడుతుంది. ఆజీర్ణం వంటి కడుపు సమస్యలు రాకుండా జాగ్రత్తపరుస్తుంది.

చెడు కొవ్వులను కంట్రోల్‌ చేయడానికి బెండకాయలు ఉపయోగపడతాయి. దీని వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి, బీపీ,గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో రక్తంలో షుగర్ లెవల్స్ ను సమతుల్యం చేయటంలో బెండకాయలు ఉపయోగడతాయి. అందుకే గర్భిణీలు బెండకాయలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోమని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బెండకాయ తొక్క, గింజలు షుగర్ ను కంట్రోల్ చేయటంలో బాగా ఉపకరిస్తాయి.

బెండకాయలు, గింజలను ఎండలో ఆరబెట్టి పిండిలా చేసి ఆహారంలో కలిపి తీసుకోవాలి. బెండలో ఫ్లెవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో ఉండే మైరిసెటిన్ శరీరంలో షగర్ ను నియంత్రణలో ఉంచటంతోపాటు క్యాన్సర్ వంటి సమస్యలు దరి చేరకుండా రక్షణ కలిపిస్తాయి. పేగు సమస్యలు ఉన్నవారు బెండకాయలకు దూరంగా ఉండటం మంచిది. బెండకాయలను పచ్చిగా కంటే ఆవిరిపై ఉడికించుకుని తినటం మంచిది. వేపుళ్లు వంటి వాటిని చేసుకోవటం తినటం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని గమనించాలి.