Leaf Curry : శరీరానికి అన్ని పోషకాలు అందించే ఆకు కూర ఇదొక్కటే!

చెంచలాకు ఔషధగుణాలు కలిగిన ఒక కలుపు మొక్క. వాత,పిత్త,కఫ దోషాలను పొగొడుతుందని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఒక రకం చెప్పాలంటే ఇది సర్వ ఔషదిగా పేరుగాంచింది. భారతీయ సాంప్రదాయ వైద్యంలో దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు.

Leaf Curry : శరీరానికి అన్ని పోషకాలు అందించే ఆకు కూర ఇదొక్కటే!

Digera Muricata

Leaf Curry : మన చుట్టూ పెరిగే అనేక కలుపు జాతి మొక్కల్లో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. వీటిని పత్యేకంగా ఎవరు పెంచరు. పొలం గట్ల వెంట వాటంతట అవే పెరుగుతాయి. పూర్వకాలం నుండి గ్రామీణ ప్రాంతాల్లో నివాసముండే మన పెద్దలు ఇలాంటి కలుపు జాతి మొక్కలనే ఆహారంలో భాగం చేసుకునే వారు. పొల్లాల్లో గట్ల వెంట లభించే అనేక రకాల ఆకు కూరలను సేకరించి వాటితో రుచికరమైన పదార్ధాలను తయారు చేసే వారు. ముఖ్యంగా అలాంటి ఆకు కూరల్లో చెంచలాకును ప్రముఖంగా చెప్పవచ్చు. నేటికీ గ్రామీణ ప్రాంతాల వారు చెంచలాకును పప్పులో వేసుకుని రుచికరమైన ఆహారాన్ని తయారు
చేసుకుంటారు.

చెంచలాకు ఔషధగుణాలు కలిగిన ఒక కలుపు మొక్క. వాత,పిత్త,కఫ దోషాలను పొగొడుతుందని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఒక రకం చెప్పాలంటే ఇది సర్వ ఔషదిగా పేరుగాంచింది. భారతీయ సాంప్రదాయ వైద్యంలో దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. పొలాల గడ్ల వెంట చెంచలాకు మొక్క విరివిరిగా కనబడుతుంది. ఈ మొక్కలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. అనేక రకాల రోగాలను నయం చేయడంలో చెంచలాకు బాగా ఉపకరిస్తుంది.

చెంచలాకులో కాల్షియం అధికమోతాదులో ఉంటుంది. దీన్ని తరచు ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఎముకలు ధృఢంగా తయారవుతాయి. కంటి సమస్యలను దరి చేరకుండా ఉంచటంలో ఇందులో ఉండే విటమిన్ ఎ దోహదపడుతుంది. చిన్నపిల్లలకు ఈ ఆకు కూరను పప్పులో వేసి పెడితే ఎంతో మంచిది. ఎంతో ఇష్టంగా కూడా తింటారు. శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించటంలో దీనిని మించింది లేదని చెప్పవచ్చు. జీర్ణ వ్యవస్ధ పనితీరును మెరుగుపరచటంతోపాటు మలబద్ధకాన్ని పోగొడుతుంది. బాలింతలో పాలు బాగా పడాలంటే ఈ చెట్టు వేర్ల కషాయాన్ని కొద్ది మొత్తంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఈ మొక్క ఆకుల కషాయాన్ని కొద్ది మోతాదులో తాగడం వల్ల మూత్ర పిండాలలో రాళ్లు కరిగిపోతాయట. ఆకులను పేస్ట్ గా చేసి గాయాలపై, పుండ్లపై ఉంచడం వల్ల త్వరగా మానిపోతాయి. ఈ మొక్క ఆకులను ఉపయోగించి ఆస్తమా, తామర, ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, రుతుక్రమం ఆగిన లక్షణాలు వంటి అనేక పరిస్థితులకు చికిత్స చేసేందుకు హెర్బల్ మెడిసిన్ గా ఉపయోగిస్తారు. మొక్కలను పూర్వం నుండే మన సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు.