ఫిబ్రవరి 29: ఎందుకు ప్రత్యేకం.. ఈరోజు పుట్టినవారికి ఉండే నైపుణ్యం ఏంటీ?

  • Published By: vamsi ,Published On : February 29, 2020 / 06:50 AM IST
ఫిబ్రవరి 29: ఎందుకు ప్రత్యేకం.. ఈరోజు పుట్టినవారికి ఉండే నైపుణ్యం ఏంటీ?

ఏడాదికి 365రోజులు.. ప్రతి రోజు ఓ ప్రత్యేకమే.. అయితే ఈ రోజు(29 ఫిబ్రవరి) మరింత ప్రత్యేకం.. నాలుగేళ్లకు ఓ సారి వస్తుంది ఈ రోజు. లీప్ సంవత్సరం అంటేనే ప్రత్యేకం.. 366రోజులు ఈ సంవత్సరానికి.. ఆ మిగిలిన ఒక్క రోజే ఈరోజు. అందుకే ఈ రోజు ఓ ప్రత్యేకమైన రోజు. నాలుగేళ్లకు ఓసారి వచ్చే ఈ రోజు ఎంత ప్రత్యుకమో.. ఈ క్రమంలోనే గూగుల్ కూడా తన డూడిల్‌ని ఈ తేదీకి అంకితం చేసింది.

అసలు ఈ రోజు ఎలా వచ్చిందంటే.. భూమి సూర్యుని చుట్టు తిరగడానికి 365రోజుల 5గంటల 48నిమిషాల 46సెకెండ్లు సమయం పడుతుంది. అయితే ఏడాదికి 365రోజులే ఉంటాయి కాబట్టి మిగిలిన ఆ 23గంటల 16నిమిషాలను ఒక రోజుగా పరిగణిస్తారు. ఇది లీప్ సంవత్సరంలో నాలుగేళ్లకు ఓ సారి వస్తుంది. ఆ లీపు సంవత్సరం ఈ రోజే.. కొత్త దశాబ్ధం ప్రారంభం అయిన ఈ రోజే లీపు సంవత్సరం. లీపు సంవత్సరంలో ఫిబ్రవరికి 29రోజులు ఉండడం విశేషం..

నాలుగేళ్ల తర్వాత 2024లో మళ్లీ ఈ లీపు సంవత్సరం వస్తుంది. లీప్ ఇయర్‌లో ఈ రోజు పుట్టినవారిని లీపర్స్ అంటారు. లీప్లింగ్స్‌ అని కూడా అంటారు. వారి కోసం ‘ద హానర్‌ సొసైటీ ఆఫ్‌ లీప్‌ ఇయర్‌ బేబీస్‌’ పేరుతో ఓ క్లబ్‌ ఏర్పాటైంది. ఇప్పటి వరకు అందులో 10వేల మంది సభ్యులు ఉన్నారు.  ఈ రోజున పుట్టిన వారికి పెయింటింగ్‌ వేసే నైపుణ్యం ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా చెబుతారు.

అసలు ఫిబ్రవరిలోనే ఎందుకు ఈ ఎక్స్ ట్రా రోజు వస్తుందంటే.. క్రీస్తు పూర్వం గ్రీస్, రోమన్‌లు కేలండర్‌లో రోజుల్నీ, నెలలనూ మార్చేసేవాళ్లు. రోమ్ చక్రవర్తిగా జూలియస్ కాసర్ బాధ్యతలు స్వీకరించేటప్పటికి రోమన్ క్యాలెండర్‌‌లో ఏడాదికి 355 రోజులే ఉండేవి. ప్రతీ రెండేళ్లకూ 22 రోజులు ఉన్న ఒక నెల అదనంగా చేరేది. ఆయన ఎంటరయ్యాక కేలండర్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో 365 రోజుల కేలండర్ అందుబాటులోకి వచ్చింది.

ఇదే సమయంలో ప్రతీ నాలుగేళ్లకూ అదనపు రోజును ఆగస్టు నెలలో కలిపారు. ఫలితంగా అప్పట్లో ఫిబ్రవరికి 30 రోజులు, జులైకి 31 రోజులు, ఆగస్టుకు 29 రోజులు ఉండేవి. అయితే జూలియస్ కాసర్ తర్వాత కాసర్ ఆగస్టస్ చక్రవర్తి అయ్యాడు. ఆయన పుట్టింది ఆగస్టులో. తాను పుట్టిన నెలలో రోజులు తక్కువగా ఉండకూడదనే ఉద్ధేశ్యంతో ఆగస్టు నెలకు 2 రోజులు పెంచుకున్నాడు. జూలియస్ కాసర్ ఫిబ్రవరిలో పుట్టాడు కాబట్టి ఫిబ్రవరిలో ఆ రెండు రోజులూ తగ్గించాడు. ఫలితంగా ఆగస్టుకి 31 రోజులు, ఫిబ్రవరికి 28 రోజులు వచ్చాయి. లీపు సంవత్సరంలో రోజును ఆ ఫిబ్రవరికి కలిపారు. 
 

See Also | పెళ్లి కూతురు సడెన్ ట్విస్ట్: ఫ్రెండొచ్చాడు.. పెళ్ళి ఆపేయండి