Left Side Sleeping : ఎడమవైపు పడుకుని నిద్రపోతే ఎన్ని ప్రయోజనాలో..ట్రై చేసి చూడండీ..

రోజంతా కష్టపడి రాత్రి నిద్రపోతే నిద్ర పట్టకపోతే మరుసటి ఉదయం లేచేసరికి చికాకుగా ఉంటుంది. కానీ హాయిగా నిద్రపట్టాలంటే ఎలా పడుకోవాలి? ఎటువైపు తిరిగి పడుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం..ముఖ్యంగా ఎడవైపు తిరిగి పడుకుంటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

Left Side Sleeping : ఎడమవైపు పడుకుని నిద్రపోతే ఎన్ని ప్రయోజనాలో..ట్రై చేసి చూడండీ..

Left Side Sleeping

Left Side Sleeping: మన పెద్దలు అవి చేయకూడదు..ఇవి చేయకూడదు అని చెబుతుంటారు. కానీ మనం వాటిని పట్టించుకోం. హా..అంతా ఛాదస్తం అని కొట్టిపారేస్తాం. కానీ మన పూర్వీకులు పెట్టిన నియమాలు, సంప్రదాయాలల్లోని పద్ధతులే సైంటిస్టులు చెబితే నిజమనుకుంటాం. అదే పెద్దవాళ్లు చెబితే అంతా ఛాదస్తం అన్నింటికి ఏదోకటి చెబుతుంటారనుకుంటాం. కానీ ఆ నియమాల్లో శాస్త్రీయ కోణం దాగి ఉందని ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది.

మన రోజువారీ తినే ఆహారం విషయంలోను..పాటించే పద్ధతుల్లోను..ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకూ పాటించే పద్ధతుల గురించి మన పెద్దలు చాలా ఉపయోగకరమైన విషయాలను చెప్పారు. వాటినే సంప్రదాయాలుగా మార్చారు. మనం రోజంతా కష్టపడి రాత్రి శరీరానికి విశ్రాంతినిస్తూ నిద్ర పోయే విషయంలో కూడా మన పెద్దలు కొన్ని నియమాలను పెట్టారు. తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలని..లేదంటే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలని చెప్పారు.. అలాగే ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదని నియమం పెట్టారు. అలాగే కుడివైపు నిద్రపోవడం మంచిది కాదని.. ఎడవైపు మాత్రమే నిద్రపోవాలని కూడా చెప్పారు. ఈరోజు ఎడమవైపు తిరిగి నిద్రపోవడం కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది..మరి ఆ ఉపయాగాలేంటో తెలుసుకుందాం..

భోజనం చేసిన అనంతరం జీర్ణం చెయ్యటానికి జఠరాగ్ని యాక్టివేట్ అవుతుంది. మెదట మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది. అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది. అందుకే మనకు భోజనం చేయగానే నిద్ర వస్తుంది. తగినంత నిద్ర విశ్రాంతి శరీరానికి చాలా చాలా మంచిది.

ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవాలని చెబుతుంటారు. కానీ ఈ బిజీ కాలంలో ఎక్కడ కుదురుతుంది? ఇటువంటి వారి కోసమే..ఓ చిట్కా కూడా చెప్పారు మనం పెద్దలు. విశ్రాంతి తీసుకునే అవకాశం లేని క్రమంలో కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయాలి. లేదా 10 నిమిషాలు వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే మన తిన్న ఆహారం త్వరంగా జీర్ణం అయిపోతుంది. ఆ తరువాత మనం మన పని చేసుకోవచ్చు. (బహుశా ఆఫీసుల్లో ఇది కూడా కుదరకపోవచ్చు) ఇక రాత్రి భోజనం త్వరగా చేస్తే మంచిది. భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు. కనీసం రెండు గంటల వ్యవధి ఇచ్చిన తరువాతే నిద్రపోవాలి. అలా చేయటం వల్ల తిన్న ఆహారం చక్కగా జీర్ణమైపోతుంది. భోజనం అరగక గ్యాస్ ట్రబుల్స్ వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతే డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి త్వరగా భోజనం త్వరగా చేయటం మంచిది. తరువాత 10 నిమిషాల నడక చాలా చాలా మంచిది.

పడుకునే విధానంలో పాటించాల్సిన నియమాలు..
ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి తలకిందకు వచ్చే విధంగా పడుకొని నిద్రపోవాలి. ఇలా నిద్రపోవడాన్ని వామ కుక్షి అవస్దలో విశ్రమించటం అంటారు. ఎవరైనా అలసటకు గురైనప్పుడు ఇలా ఎడమ వైపున తిరిగి పడుకుంటే అలసట తొలగి పోతుంది. ప్రశాంతంగా నిద్రపడుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకోవచ్చు.

ఎడమ వైపు తిరిగి పడుకోవటం వల్ల ప్రయోజనాలు..

-చాలా మందికి నిద్రలో గురక వస్తుంది. ఎడమవైపు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకుంటే గురక తగ్గుతుంది.
-ముఖ్యంగా గర్బిణీ స్త్రీలు ఎడమవైపుకు పడుకుంటే మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. ఇది గర్బాశయానకి చాలా ఉపయోగపడుతుంది. తద్వారా కడుపులోని పిండానికి, మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగుతుంది.
-వెన్ను నొప్పి..వీపు నొప్పుల ఉంటే వాటినుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది.
-భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది. అంటే ఎడమవైపుకు తిరిగి పడుకోవటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
-వీపు , మెడ నొప్పులున్నవారికీ ఉపశమనం ఇస్తుంది.
-శరీరంలో వున్న విష, వ్యర్ధ పదార్ధలని తొలగించే రసాయనాలకు ఉపయోగకరంగా ఉంటుంది.
-కాలేయం, మూత్ర పిండాలు సక్రమంగా పని చేయటానికి ఉపయోగకరంగా ఉంటుంది.
-గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేస్తుంది..అంటే ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి గుండె సక్రమంగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది.
-కడుపులోని ఆమ్లాలు సక్రమంగా పనిచేస్తాయి..తద్వారా గుండెలోని మంటను నిరోధిస్తుంది.
-ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా లేచి పనులు చేసుకోవటానికి ఈ నిద్ర చాలా ఉపయోకరంగా ఉంటుంది.
-కొవ్వు పదార్ధాలు తింటే వాటిని సులభంగా జీర్ణం కావటానికి ఉపగకరంగా ఉంటుంది.
-మెదడు చురుకుగా పని చేస్తుంది .
-అల్జీమర్ (మతిమరుపు) వ్యాధులను కంట్రోలు చేస్తుంది.

ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతని ఆయుర్వేద డాక్టరు తెలిపారు. ఎడమ వైపు తిరిగి పడుకొన్న తర్వాత మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించండీ..అవునో కాదో మీకే తెలుస్తుంది. దీని ఖర్చు లేదు కాబట్టి ప్రయత్నించి చూడండీ..మార్పును గమనించండీ..