Lemon Juice : నిమ్మరసం మితంగా తీసుకుంటే మంచిదే! మోతాదుకు మించితే అనర్ధమేనా?

ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసాన్ని వేసి కలిపి తీసుకోవడం వల్ల క్రమంగా మూత్ర పిండాలలో రాళ్లు కరిగిపోతాయి. దీంతో చర్మం మృదువుగా, కాంతి వంతంగా కనిపిస్తుంది. జీర్ణాశయం, సంబంధిత వ్యాధులు తగ్గతాయి.

Lemon Juice : నిమ్మరసం మితంగా తీసుకుంటే మంచిదే! మోతాదుకు మించితే అనర్ధమేనా?

Lemon juice

Lemon Juice : నిమ్మకాయ ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది. దీనిని మనం ఆహారంలో భాగంగా తీసుకుంటాం. నిమ్మకాయలను వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. పుల్లగా ఉండే నిమ్మపండు వాత రోగాలను పోగొట్టడంలో ఎంతో ఉపయోగపడుతుంది. జీర్ణ శక్తిని మెరుగుపచడంతో పాటు పొట్టలో ఉండే క్రిములను హరిస్తుంది. నీరసాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.

నిమ్మరసంలో విటమిన్‌-సీ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫంగల్‌, బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు కూడా ఉంటాయి. ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నిమ్మకాయను మించిన ఔషధం లేదు. నిమ్మరసంలో చక్కెరను వేసి తాగితే శరీరంలోని వ్యర్ధపదార్ధాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసాన్ని వేసి కలిపి తీసుకోవడం వల్ల క్రమంగా మూత్ర పిండాలలో రాళ్లు కరిగిపోతాయి. దీంతో చర్మం మృదువుగా, కాంతి వంతంగా కనిపిస్తుంది. జీర్ణాశయం, సంబంధిత వ్యాధులు తగ్గతాయి. ప్రతీరోజు నిమ్మరం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావు. హైడ్రేష్ నుంచి శరీరాన్ని కాపాడడం సహా చర్మానికి కూడా నిమ్మరసం మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు రోజూ నిద్ర పోయే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల వెంటనే బరువు తగ్గే అవకాశం ఉంది. నిమ్మకాయ రసాన్ని మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగిస్తారు. ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్ లా పనిచేస్తుంది.

అయితే నిమ్మరసంను అధికంగా తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లా శాతం పెరిగి అంతర్గత లైనింగ్ ను దెబ్బతియ్యడం వల్ల పెప్టిక్ అల్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిమ్మరసం, సిట్రిక్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల క్రమంగా మన శరీరంలో ఉండే ఐరన్ ఉండాల్సినదానికి కంటే ఎక్కువగా ఉంటే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. నిమ్మరసంలో ఉండే టైరామిన్ అనే అమినో యాసిడ్ బ్రెయిన్ కు సడెన్ గా రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఇది తలనొప్పికి దారితీస్తుంది.