Lemongrass Tea : రోగనిరోధక శక్తిని పెంచే లెమన్ గ్రాస్ టీ

లెమన్ గ్రాస్ టీ యాంటీడిప్రజెంట్ మరియు అప్ లిప్టింగ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది. మూడ్ ను మార్చుతుంది . లెమన్ గ్రాస్ లో ఉండే ఆరోమా వాసన బ్రెయిన్ లో సెరోటినిన్ విడదుల చేస్తుంది.

Lemongrass Tea : రోగనిరోధక శక్తిని పెంచే లెమన్ గ్రాస్ టీ

Lemon Gross

Lemongrass Tea : లెమన్ గ్రాస్… నిమ్మగడ్డి. ఇది అనే ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. దీన్ని వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. మ‌న దేశంతోపాటు ప‌లు ఆసియా దేశాల్లోనూ లెమ‌న్ గ్రాస్ మొక్క బాగా పెరుగుతుంది. ఈ మొక్క ఆకుల్లో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయి. లెమ‌న్‌గ్రాస్ ఆకుల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్‌ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఈ ఆకులు ఔష‌ధంగా ప‌నిచేస్తాయి. అయితే లెమన్‌గ్రాస్ ఆకుల నుంచి త‌యారుచేసే టీ ని రోజు తాగ‌డం వల్ల కూడా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ఇది సువాసన కలిగి ఉంటుంది.

ఈ టీ తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రంతో పాటు.. త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, క‌డుపు నొప్పి త‌గ్గుతాయి. అంతేకాదు ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగు ప‌డుతుంది. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. ఇంకా కిడ్నీ స‌మ‌స్య‌లు తొలగిపోయి.. శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గడమే కాకుండా.. డ‌యాబెటిస్ కంట్రోల్ అవుతుంది.అధిక రక్తపోటును తగ్గించడంలో లెమన్‌గ్రాస్‌ చక్కగా పనిచేస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

స్త్రీలలో రుతుస్రావం సమయంలో వచ్చే సమస్యలకు, పొట్ట ఉబ్బరానికి న్యాచురల్‌ రెమిడీగా పనికొస్తుంది. రోజూ లెమన్‌గ్రాస్‌ టీ తాగితే కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు దంత క్షయాన్ని అరికడతాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు లెమన్‌గ్రాస్‌ టీ ఉపకరిస్తుంది. లెమన్ గ్రాస్ లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్, పొటాషియ, ఫాస్పరస్, క్యాల్షియం మరియు మెగ్నీషియంలున్నాయి.

లెమన్ గ్రాస్ టీ యాంటీడిప్రజెంట్ మరియు అప్ లిప్టింగ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది. మూడ్ ను మార్చుతుంది . లెమన్ గ్రాస్ లో ఉండే ఆరోమా వాసన బ్రెయిన్ లో సెరోటినిన్ విడదుల చేస్తుంది. మనస్సును ప్రశాంత పరుస్తుంది. ఆందోళను తగ్గిస్తుంది. లెమన్ గ్రాస్ టీ శరీరంలోని ఫ్యాట్ ను గ్రహించేస్తుంది. ఫ్యాట్ ను విచ్చిన్నం చేసి బర్న్ అయ్యేలా చేస్తుంది . కొలెస్ట్రాల్ తగ్గించడంతో రక్తకణాల్లో కొవ్వు చేరకుండా హార్ట్ అండ్ హార్ట్ అటాక్ సమస్యల నుండి రక్షిస్తుంది. లెమన్ గ్రాస్ టీ ని తరచూ తీసుకుంటే మతిమరపు నుండి ఉపశమనం పొందుతారు. నాడీవ్యవస్థను స్థిరంగా ఉంచుతుంది. అజీర్తి , మలబద్దకం సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.