Prevent Heart Disease : జీవనశైలిలో మార్పులే గుండె జబ్బుల నివారణకు మంచి మందు!

ఒత్తిడి జీవితంలో సాధారణంమే అయినప్పటీకీ అది దీర్ఘకాలికమైతేనే ప్రమాదకరంగా మారుతుంది. ఒత్తిడి కారణంగా బ్లడ్ షుగర్, రక్తపోటు పెరుగుతుంది. తరువాత వీటి కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

Prevent Heart Disease : జీవనశైలిలో మార్పులే గుండె జబ్బుల నివారణకు మంచి మందు!

Lifestyle changes are the best medicine to prevent heart disease!

Prevent Heart Disease : గుండె జబ్బులు దరిచేరకుండా ఉండేందుకు జీవనశైలిలో మార్పులు తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారంలో కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉండే పోషకాలు, ప్రోటీన్, ఫైబర్, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వు రహిత లేదా తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, చేపలు, పౌల్ట్రీ, గింజలు వంటి వాటిని తీసుకోవాలి. డీప్ ఫ్రై చేయడానికి వాడిన నూనెను మరలా వాడొద్దు. రోజువారిగా 30 నిమిషాల పాటు వ్యాయామాలు చేయాలి. క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్షలు చేయించుకోండి. ఇలా చేయటం ద్వారా ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. బలవర్థక ఆహారాన్ని తీసుకోవడం అన్నది చాలా కీలకమన్న విషయం గుర్తుంచుకోవాలి. గుండెకు హానికలిగించే కారకాలైన మద్యపానం, దూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

ఒత్తిడి జీవితంలో సాధారణంమే అయినప్పటీకీ అది దీర్ఘకాలికమైతేనే ప్రమాదకరంగా మారుతుంది. ఒత్తిడి కారణంగా బ్లడ్ షుగర్, రక్తపోటు పెరుగుతుంది. తరువాత వీటి కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి వల్ల ధమనులలో ఫలకం నిక్షేపాల నిర్మాణాలు ఏర్పడి గుండెకు సరఫరా అయ్యే రక్త ప్రసరణలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో గుండెపోటు సంభవిస్తుంది. రక్త నాళికలలో పేరుకున్న కొవ్వు, ఇతరత్రా వాటితో గుండె పోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. గుండె పోటు వచ్చినప్పుడు ఛాతీలో తీవ్ర నొప్పి రావడం, చెమటలు పట్టడం, శ్వాసలో ఇబ్బంది, వాంతులు, గొంతెండి పోవడం, తల తిరగడం, హఠాత్తుగా అలసట వంటివి ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఛాతీ మధ్యలో కొన్ని నిమిషాలపాటు తీవ్ర నొప్పి, ఛాతీ భారంగా లేదా పట్టేసినట్టుండటం, గుండె నుంచి భుజాలు, మెడ, చేతులు, జబ్బలలో భరించలేని నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి చిన్న లక్షణాలను చాలా మంది తేలికగా తీసుకుంటారు. అలా చేయటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని గుర్తుంచుకోవాలి.

10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”.. https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అలాగే ఊబకాయం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. అధిక ఆల్కహాల్ రక్తపోటును పెంచుతుంది. మధుమేహంతో బాధపడుతున్నవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. క్రమం తప్పకుండా చక్కెర స్థాయిలను చెక్ చేసుకోవాలి. ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా మనస్సును ప్రశాంతవైపు మళ్లించాలి. ఏ చిన్నా అనుమానం, ఇబ్బంది వచ్చినా వెంటనే వైద్యుల సూచనలు సహాలు తీసుకోవాలి. వారు సూచించిన విధాంగా చికిత్సను పొందటం ఉత్తమం. సొంత ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.